BigTV English

#AA22 Update: లుక్ టెస్ట్ కంప్లీట్.. కొత్త లుక్ కుదిరిందా..?

#AA22 Update: లుక్ టెస్ట్ కంప్లీట్.. కొత్త లుక్ కుదిరిందా..?

#AA22 Update:అల్లు అర్జున్ (Allu Arjun).. ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. అని ఇప్పటికే ఎంతోమంది పలు రకాలుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ బ్రాండ్ కు తగ్గట్టుగానే ఆయన కూడా ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరించడానికి విభిన్నమైన పాత్రలతో సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’ సినిమా ముందు వరకు కూడా కేవలం మలయాళం , టాలీవుడ్ ఇండస్ట్రీలలో మాత్రమే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన పుష్ప సినిమాతో బాలీవుడ్ లో ఊహించని మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రూ.100కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించారు. అంతేకాదు తొలి నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు నటుడుగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. పైగా అభిమానులందరిలో కూడా క్యూరియాసిటీ పెంచేసి మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూల్ చేసి ఇదీ తన బ్రాండ్ అంటే అంటూ నిరూపించుకున్నారు అల్లు అర్జున్. ఇప్పటి వరకు ‘దంగల్’ సినిమా రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరని ఎంతోమంది అనుకున్నారు. కనీసం దరిదాపులకు కూడా రాలేరు అనుకున్నారు. కానీ పుష్ప2 మాత్రం ఇంకొన్ని రోజులు ఆడింటే ఈ బ్రేక్ ని రికార్డు చేసేదేమో అని అనుకున్నారు కూడా.. అంతలా అల్లు అర్జున్ తన స్టామినా ఏంటో నిరూపించారు.


#AA 22 కోసం లుక్ టెస్ట్ కంప్లీట్..

ఇక ఆ సినిమాలతో క్రియేట్ చేసిన హవా ఇప్పుడు అంతే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఏకంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతూ.. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించబోతున్నారు. ‘సన్ పిక్చర్స్ బ్యానర్’ పై కళానిధి మారన్ (Kalhanidhi Maran) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేయగా.. ఈ వీడియో అమాంతం అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ గా మారింది. అదేంటంటే అల్లు అర్జున్ లుక్ కి సంబంధించి టెస్ట్ పూర్తయిందనీ.. అందులో రెండు లుక్స్ ను సెలెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.


రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్న బన్నీ..

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో అల్లు అర్జున్ పై లుక్ టెస్ట్ తో పాటు కాన్సెప్ట్ ఫోటో షూట్ కూడా చేసినట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన గెటప్ లో కనువిందు చేయనున్నారట. అందుకు తగ్గట్టుగానే ఈ కాన్సెప్ట్ ఫోటోషూట్ లో కూడా అల్లు అర్జున్ పలు లుక్స్ ని ప్రయత్నించగా.. అందులో రగ్గడ్, స్లీక్, ఫ్యూచరిస్టిక్, ఔటర్ స్పేస్ ఇలా పలు లుక్ లను పరీక్షించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిలో రెండు లుక్స్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడి ఉండే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ సినిమా రాబోతోందని, ఇందుకోసం ఒక కొత్త ప్రపంచాన్ని చిత్ర బృందం సృష్టించే పనిలో ఉందని ,అలాగే హాలీవుడ్ ki చెందిన ఒక ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇందుకోసం రంగంలోకి దిగుతోందని సమాచారం. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఈ సినిమాతో ఆస్కార్ బరిలోకి దిగడం ఖాయమని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×