BigTV English

Team India: మనోళ్లు.. ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నారా?

Team India: మనోళ్లు.. ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నారా?

Ind vs SL 2nd ODI Match Highlights: టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా సీనియర్లు ఇంకా రిలాక్స్ మోడ్ లోంచి బయటకు రాలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీలను వదిలి నెలల తరబడి ఉన్న క్రికెటర్లు, నేడు అలా ఉండలేక పోతున్నారని అంటున్నారు. ఇంటి బెంగ ఎక్కువై పోయిందని, హోమ్ సిక్ తో బాధపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


ఇవేవీ కాదంటే.  ఎలాగూ వయసైపోయింది కదా.. ఆడినంత కాలం ఆడి, తట్టా బుట్టా సర్దేద్దామనే ధోరణిలో ఉన్నారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక మూడో కారణం ఏమిటంటే.. శ్రీలంక జట్టు ఎంత.? ఉఫ్ మని ఊదేద్దామని అనుకున్నారా? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా కొంప ముంచిందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకటంటే అనుకోవచ్చు, రెండు వన్డేల్లో కూడా అందరూ అదే రీతిలో తడబడటం చూస్తుంటే, ప్రాక్టీస్ తగ్గిందనేది మాత్రం నిజం అంటున్నారు. మొదటి వన్డే తరహాలోనే, రెండో వన్డేలో కూడా ఐదుగురు ఎల్బీలుగా వెనుతిరిగారు.
శ్రీలంక వికెట్ ఎటాకింగ్ చేస్తుంటే, మనవాళ్లు ఆడటమే రాదన్నట్టు ఆఢుతుంటే, అది చూసి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇకపోతే  ఫామ్ లో లేని శ్రీలంక జట్టు టీమ్ ఇండియాపై బ్యాటింగు చేస్తూ అలవోకగా 230, 240 పరుగులు చేసేస్తోంది.

ఈ మధ్యలో కోచ్ గౌతంగంభీర్ అనవసర ప్రయోగాలు జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. మొదటి వన్డేలో గిల్ బౌలింగు వేసి 14 పరుగులిచ్చాడు. ఆ ప్రయోగం ఆపి ఉంటే, టీమ్ ఇండియా ఒక్క పరుగుతో గెలిచేది. ఇక రెండో వన్డేలో సెకండ్ డౌన్ శివమ్ దుబె వచ్చాడు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. ఆ తర్వాత శ్రేయాస్, ఆ తర్వాత రాహుల్ ఇలా వచ్చారు.

ఇలా బ్యాటర్ల ఆర్డర్ మార్చడమంటే, ఆటగాళ్ల మైండ్ సెట్ మార్చడమేననే సంగతి అందరికీ తెలిసిందే. ఇదీ కరెక్ట్ కాదని అంటున్నారు. ఇకపోతే ఐపీఎల్ లో ధనాధన్ ఆడిన శివమ్ దూబె, అంతర్జాతీయ మ్యాచ్ ల్లో తేలిపోతున్నాడు. సీనియర్లందరూ మళ్లీ వచ్చారని సంతోషపడిన భారత అభిమానుల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరి ఆగస్టు 7న జరిగే చివరి మూడో వన్డేలో.. మన మొనగాళ్లకు మొనగాళ్లు ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.


Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×