BigTV English

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ లాస్ట్ డే షూట్.. రిషిధార ఏం చేశారో చూడండి

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ లాస్ట్ డే  షూట్.. రిషిధార ఏం చేశారో చూడండి

Guppedantha Manasu Serial: సాధారణంగా ఒక సీరియల్ అయిపోతుంది అంటే.. చాలామంది హమ్మయ్య సీరియల్ అయిపోతుంది అని సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ, గుప్పెడంత మనసు సీరియల్ అయిపోతుంది అంటే అభిమానులు.. తమ మనసుకు చాలా కష్టంగా ఉందని చెప్పుకొస్తున్నారు.


గుప్పెడంత మనసు.. ముకేశ్  గౌడ, రక్ష గౌడ జంటగా కుమార్ పంతం దర్శకత్వంలో తెరకెక్కిన సీరియల్. స్టార్ మా లో ఈ సీరియల్ 2020 లో మొదలయ్యింది.


రిషి అనే ఒక కాలేజ్ ఎండీకి.. ఆ కాలేజ్ లో చదవడానికి వచ్చిన వసుధార అనే స్టూడెంట్ కు మధ్య జరిగే ప్రేమకథనే గుప్పెడంత మనసు కథ. ఇక ఈ సీరియల్ లో దీంతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ ను కూడా చూపించడంతో.. సీరియల్ ఎంతో గుర్తింపుతెచ్చుకుంది.

 

మొదటి 100 ఎపిసోడ్స్  కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించగా.. ఆ తరువాత కుమార్ పంతం  దర్శకత్వంలో  ఈ సీరియల్  మరింత ఫేమస్ అయ్యింది.

రిషిధారను ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు. రిషిని అయితే తమ ఇంట్లో మనిషిగా  అభిమానులు అక్కున చేర్చుకున్నారు. కొన్నికారణాల వలన అతను సీరియల్ నుంచి తప్పుకున్నా.. ఫ్యాన్స్ పట్టుబట్టి మళ్లీ రప్పించారు.

ఈ సీరియల్ ద్వారా చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. సాయి కిరణ్, సురేష్ లాంటి నటులు.. తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇక గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగుకు పరిచయమైన రక్ష.. ఈ సీరియల్ తరువాత కన్నడలో హీరోయిన్ గా మారింది.

ఎట్టకేలకు గుప్పెడంత మనసు సీరియల్ ఎండింగ్ కు చేరుకుంది. ఆగస్టు 11 న ఈ సీరియల్ లాస్ట్ డే షూట్  జరిగింది.

చివరిరోజు షూట్ లో సీరియల్ బృందం మొత్తం బరువైన మనసుతో షూటింగ్ జరుపుకున్నారు.

సాయి కిరణ్, రక్ష, రవి రాథోడ్, ముకేశ్.. చివరి రోజు షూట్ లో పాల్గొన్నారు. ఈ సీరియల్ ను ముగించడం తమకు కూడా కష్టంగా ఉందని తెలిపారు.

సీరియల్ బృందం మొత్తం కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో సీరియల్ కోసం పనిచేసిన టెక్నీషయన్స్  అందరూ పాల్గొన్నారు.

కేక్ కట్ చేసిన అనంతరం రిషిధార బిగ్గరగా అరుస్తూ సందడి చేసారు. ఈ సీరియల్ తమకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టిందని  తెలిపారు.

ప్రస్తుతం గుప్పెడంత మనసు లాస్ట్ డే షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×