Keerthy Suresh Latest Photos: నవతరం నాయిక కీర్తి సురేష్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మహానటి సావిత్రి.
నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.
నానీ సరసన నేను లోకల్ సినిమాలో అలరించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసి సినిమాలో నటించింది.
ఇక ఆ తర్వాత సావిత్రి జీవితగాధగా చిత్రీకరించిన మూవీ మహానటి. ఈ సినిమాలో తన నటనతో జాతీయ అవార్డు అందుకుంది.
రంగ్ దే, భోళా శంకర్, గుడ్ లక్, సఖి వంటి పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది.
ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించింది.
కీర్తి సురేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్, వీడియోలతో అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తాజాగా రిబ్బన్ జడతో శారీ లుక్ లో ఫోటోలకు ఫోజులిస్తూ It’s time to Ribbon drop with #Kayalvizhi 🩵🤍 అంటూ కాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.