Sobhita Dhulipala latest news(Tollywood celebrity news): శోభితా ధూళిపాళ్ల.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒకప్పుడు శోభితా గురించి ఎవరు అంత పెద్ద పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ అంటూ పుకార్లు వచ్చాయో అప్పటి నుంచి ఆమెపై ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు.
ఇక ఈ మధ్యనే చైతో ఎంగేజ్ మెంట్ అయ్యాకా మరింత ఫేమస్ అయ్యింది. ఎంతగా అంటే.. టాప్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలబడింది. ప్రతి నెల అత్యధిక ప్రజాదరణ కలిగిన సెలబ్రిటీల లిస్ట్ IMDB ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా ఈ నెల ఆ లిస్ట్ ను ప్రకటించగా.. శోభితా సెకండ్ ప్లేస్ లో ఉంది. టాప్ ప్లేస్ లో బాలీవుడ్ నటి శార్వరీ నిలబడింది.
చైతో ఎంగేజ్ మెంట్ అయ్యాక.. అసలు ఎవరు శోభితా అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ వారం పాపులర్ సెలబ్రిటీ లిస్ట్ లో శోభితా చేరింది. అది ఎంతలా అంటే షారుఖ్ ఖాన్ ను కూడా వెనక్కి నెట్టి మరీ ముందు నిలబడింది. దీంతో అభిమానులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక శోభిత గురించి చెప్పాలంటే.. పక్కా తెలుగు అమ్మాయి. బాలీవుడ్ లో రాఘవ 2.0 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో గూఢచారి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా శోభితాకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. త్వరలోనే అక్కినేని కోడలుగా అడుగుపెట్టనుంది.