E-Paper
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో.. ఎక్కడినుంచంటే ?

Hyderabad Metro: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో..  ఎక్కడినుంచంటే ?
Advertisement

Hyderabad Metro: మెట్రో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో జనాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే నూతన మెట్రో మార్గాలు కూడా నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలివేటెడ్ మార్గాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు మాత్రం భూగర్భం మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. అయితే రెండో దశలో దీనిని ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్‌దేవ్ పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్ , శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 33.1 కిలో మీటర్ల మేర పొడగించనున్నారు. ఈ ప్రతిపాదిక మార్గంలో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 ఎలివేటెడ్ మార్గం ఉంది. అక్కడ నుంచి పీ 7 రోడ్డు ఎయిర్ పోర్టు ప్రాంగణ సరిహద్దు వరకు 5.28 కిలో మీటర్ల మేర భూమార్గం ఉంది. అయితే అక్కడి నుంచి టెర్మినల్ వరకు 6.42 కిలో మీటర్ల మార్గంలో అండర్ గ్రౌండ్  మార్గం నిర్మించనున్నారు.

Advertisement

Also Read: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!

నగరంలో ఇదే తొలి అండర్ గ్రౌండ్ మార్గం అవుతుంది. అలాగే  ఇక్కడ కార్గో, టెర్మినల్, ఏకోసిటీ స్టేషన్లు కూడా నిర్మించడంతో పాటు డిపోను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ సారి రెండవ దశ మెట్రోలో 1.5 కిలో మీటరుకు ఒక స్టేషన్ ఉండేలా మొత్తం 22 స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ స్టేషన్లుగానూ ఉంచనున్నారు. అలాగే నాగోల్ ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్‌దేవ్ పల్లి వద్ద ఇంటర్ చేంజ్‌స్టేషన్లు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×