Mamitha Baiju: ఒక్క సినిమా చాలు ఎలాంటి వారినైనా ఓవర్‌నైట్‌లో స్టార్ చేయడానికి. ఇలాంటి లక్కుతో ఎంతో మంది నటులు, నటీమణులు సింగిల్ మూవీతో స్టార్డమ్ అందుకున్నారు.
అందులో మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు ఒకరు. సినీ కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆ తర్వాత మలయాళంలో పలు సినిమాలు చేశారు. కానీ అవేమి పెద్దగా పేరు తీసుకురాలేదు.
కానీ ఇటీవల రిలీజ్ అయిన ‘ప్రేమలు’ మాత్రం ఆమె పేరును మారుమోగించేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా మలయాళీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయారు.
ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ప్రేమలు మూవీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
అయితే ఒక్క సినిమానే కాదండోయ్.. క్యూట్ బ్యూటీ మమితా కూడా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.
దీంతో మలయాళంతో పాటు తెలుగులోనూ పలు ఆఫర్లు అందుకున్నారు.
కాగా ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోన్నారు.
ఇప్పుడు మరికొన్ని ఫొటోలను షేర్ చేశారు. కేరళలో అత్యంత ప్రతిష్టాత్మక పండుగ ఓణం పండుగ.
ఈ పండుగ సందర్భంగా మమిత తన అందమైన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తెల్ల చీర, చేతిలో మల్లెపూలతో మమితా అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.