BigTV English

Fennel Water For Weight Loss: సోంపు వాటర్‌తో వెయిట్ లాస్..

Fennel Water For Weight Loss: సోంపు వాటర్‌తో వెయిట్ లాస్..

Fennel Water For Weight Loss: సోంపులో అధిక పోషకాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలకు సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. సోంపు వాటర్ కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే సోంపు తినడం, సోంపుతో చేసిన నీరు త్రాగడం వల్ల బరువు తగ్గుతారు. అంతే కాకుండా సోంపు వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


సోంపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. సోంపు వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు వాటర్ తాగడం వల్ల 5 ప్రయోజనాలు..


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సోంపు వాటర్ జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే అనెథోల్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను ఇదితగ్గిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయకారిగా ఉంటుంది:
సోంపులో ఫైబర్ ఉంటుంది, ఇది మీకు సమయం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. ఇది ఆహారం తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఫుడ్ తినాలన్న కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

నోటి దుర్వాసనను తొలగిస్తుంది:
సోంపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతే కాకుండా నోటి దుర్వాసనను తొలగిస్తాయి. సోపు గింజలు నమలడం, సోపు నీరు తాగడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.

పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది:
సోంపు కండరాల నొప్పిని తగ్గించే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: కాలేయాన్ని శుభ్రపరిచే డ్రింక్స్ ఇవే !

చర్మానికి మేలు చేస్తుంది:
సోంపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.

సోంపు వాటర్ ఎలా తయారు చేయాలి ?
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సోంపు గింజలు వేసి మరిగించాలి. దీన్ని వడపోసి చల్లార్చి తాగాలి. నీరు త్రాగేటప్పుడు సోంపు గింజలను తినండి. దీంతో మీరు సోంపు వాటర్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందుతారు. మీకు కావాలంటే సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు కూడా ఈ నీటిని తాగవచ్చు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Big Stories

×