Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

గతేడాది షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీలో నటించి అదరగొట్టేసింది.

తాజాగా జీక్యూ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ వేడుకలో ఈ బ్యూటీ పాల్గొంది.

ఈ వేడుకలో నయన్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇందులో ఆమె తన అందంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

దీంతో చాలామంది నెటిజన్లు.. మనం చూసేది నయనతారానేనా.. మరీ ఇంతలా చేంజ్ అయిందేంటి అంటూ చర్చించుకుంటున్నారు.

ఏప్రిల్ 25న జరిగిన ఈ ఫొటో షూట్‌లో బాలీవుడ్ తారాలోకం పాల్గొనగా.. అందులో నయన్ మాత్రమే అట్రాక్షన్‌గా నిలిచింది.

దీంతో నయన్ తన గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.