“ఎవరే అతగాడు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేదు.
ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించి మళ్లీ తెలుగు సినిమాలపై ఆశక్తి చూపింది. “పెళ్లైన కొత్తలో “అనే సినిమాతో జగపతిబాబు సరసన నటించింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన “యమదొంగ” సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
అప్పటివరకు తెలుగు అమ్మాయిలాగా నటించిన ప్రియమణి గ్లామర్ డాల్ అవతారమెత్తింది. మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర వంటి పలు సినిమాల్లో నటించింది.
హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోను నటించింది. చారులత, చండి, క్షేత్రం వంటి చిత్రాల్లో చేసింది.
ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది.
కొన్నాళ్లు ఈటీవీ షోలో డీ ప్రోగ్రామ్‌కి జడ్జ్‌గా వ్యవహరించింది.
ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.