Anupama Parameswaran: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

గతేడాది కార్తీకేయ 2, 18 పేజీస్ చిత్రాలతో వచ్చి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

అయితే గతంలో ఎలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలను చేయబోనని చెప్పిన ఈ కుట్టి.. అవకాశాలు రాకపోవడంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై రొమాంటిక్ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు ఈ ఏడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటించి అదరగొట్టేసింది.

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఈ మూవీతో అను బ్యూటీ క్రేజ్ ఫుల్‌గా పెరిగిపోయింది.

ఒకరకంగా యూత్ ఈ సినిమాకు అట్రాక్ట్ కావడానికి ఈ ముద్దు సీన్లే కీలకం అని చెప్పాలి.

ఇకపోతే ఈ మూవీ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుపమ గత కొద్ది రోజుల నుంచి తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

తాజాగా ఎర్రచీరలో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అందులో చిరునవ్వులు చిందిస్తూ.. ఉంగరాల జుట్టుతో కుర్రకారు హృదయాలను దోచేసుకుంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.