E-Paper
Advertisement

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!
Advertisement

రేవంత్ చేస్తున్న చ‌ర్య‌లు, కార్య‌క్ర‌మాలపై ఇటీవ‌ల విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌భుత్వానికి ఇరుకున పెట్టే ప‌నిలో బీజేపీ, బీఆరెస్ ఈ మ‌ధ్య దాడి ఎక్కువ మొద‌లు పెట్టింది. అది వ్య‌క్తిగ‌తంగా కూడా ఉంటుంది. ధాన్యం కొనుగోళ్ల ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి. ఎన్టీఆర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌, రైతు డిస్కం.. ఇవ‌న్నీ అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో వీట‌పై నిర్మాణాత్మ‌క‌మైన విష‌య ప‌రిజ్ఞానంతో మాట్లాడే నేత‌లెవ్వ‌రూ లేర‌క్క‌డ‌. అందుకే ఆయ‌నే ఇవాళ రంగంలోకి దిగాడు. మీడియాతో చిట్‌చాట్ చేస్తూ అన్ని విష‌యాల‌పై స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇస్తూనే.. రెండు పార్టీల‌కు టార్గెట్ చేశాడు రేవంత్‌. హ‌రీశ్‌రావు తెర‌వెనుక రాజ‌కీయంగా ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడో అన్నీ తెలుసున‌ని బాంబు వేశాడు. ఆయన మొత్తంగా ఇవాళ మాట్లాడిన చిట్ చాట్‌లో ధాన్యం కొనుగోళ్ల‌పై క‌రెక్టు క్లారిటీ దొరికింది చాలా మందికి.

ఉన్న‌దున్న‌ట్టుగా వాస్త‌వ ప‌రిస్థితి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు రేవంత్‌. కేంద్రం కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతోనే ధాన్యం కొనుగోళ్ల‌లో ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఒప్పుకున్న ఆయ‌న‌.. ఈ మ‌ధ్య ఇదే విష‌యంలో బీజేపీ బ‌స్సుయాత్ర చేస్తున్న విధానం పైనా విరుచుకుప‌డ్డాడు. కేంద్రం కొనుగోలు చేయ‌క‌పోతే బీజేపీ నేత‌ల ఇళ్ల‌ముందు ధ‌ర్నా చేస్తామ‌న్నారు. గ‌తంలో కూడా కేసీఆర్ ఢిల్లీలో వ‌డ్లు పోసి మ‌రీ నిర‌స‌న తెలిపిన విష‌యం తెలిసిందే. ఇక కేటీఆర్ పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రైతు డిస్కం పేరుతో తాము తెస్తున్న ఈ కొత్త విధానంతో రైతుల‌కు మేలే జ‌రుగుతుంది.. కానీ న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని, బీఆరెస్ ఆరోపిస్తున్న విధంగా ఇర‌వై నాలుగ్గంట‌లు ఉచిత క‌రెంటు ఇవ్వ‌కున్నా.. మోటార్ల‌కు మీట‌ర్లు బిగించినా.. మేము మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయం.. మీరు కూడా పోటీకి దూరంగా ఉంటారా? అని స‌వాల్ విసిరారు.

Advertisement

దీంతో బీఆరెస్ చేస్తున్న మూడు గంట‌ల క‌రెంటే ఇస్తార‌నే దుష్ప్ర‌చారానికి ఆయ‌న చెక్ పెట్టారు. ప్ర‌జ‌ల‌కు క్లారిటీగా విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్టీఆర్ విగ్ర‌హ ఏర్పాటు పైనా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. త‌న చేష్ట‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. ఖ‌మ్మంలో పువ్వాడ పెట్టిన‌ప్పుడు ఎందుకు అభ్యంత‌రం రాలేద‌ని ప్ర‌శ్నించారు. కేటీఆర్ ఆంధ్రాలో పోటీ చేస్తాన‌న్న‌ప్పుడు, అక్క‌డ బీఆరెఎస్ అధ్య‌క్షుడి తోట చంద్ర‌శేఖ‌ర్‌కు హైద‌రాబాద్‌లో అప్ప‌నంగా భూములు అప్ప‌గించిన వైనంపై నిల‌దీయ‌లేందుకు అని గ‌తంలో మొత్తం త‌వ్విపోసి బీఆరెస్‌ను సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డేశారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీవీ నర్సింహారావు విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తామ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇక హ‌రీశ్‌పై మాట‌ల దాడి చేశారు సీఎం. ఆయ‌న పార్టీలో ఉండ‌ద‌ని, ఇత‌ర దారులు వెతుక్కుంటున్నార‌న్న ఆయ‌న‌.. కేసీఆర్‌పై ఒట్టేసి త‌ను ఎప్ప‌టికీ బీఆరెస్‌లోనే ఉంటాన‌ని మాటిస్తాడా అని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విష‌యంలో ఆయ‌న కీల‌క మాట‌లు చెప్పారు. కేంద్రంలో రాహుల్ ప్ర‌ధాని కాగానే.. మ‌హేశ్‌కు మంచి ప‌ద‌వి వస్తుంద‌ని అన్నారు. మొత్తానికి ఈ మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు ఒక్క మీడియా చిట్‌చాట్‌తో అంద‌రి అనుమానాలు నివృత్తి చేయ‌డంతో పాటు.. ఇటు బీఆరెస్‌ను , అటు బీజేపీని ఇరుకున పెట్టి, సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డేశాడు రేవంత్‌.

Related News

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

Big Stories

Advertisement
×