E-Paper
Advertisement

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?
Advertisement

పేదోడి సొంతింటిపై ప్రభుత్వాలు ప్రకటించే స్కీంలు జనాలను ఎప్పటికీ ఆశల పల్లకీలో ఊరేగించేవే. ఈ సొంతింటి కలపై కేసీఆర్‌ చేసిన ప్రకటన మాత్రం తెలంగాణ జనంలో విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. అంచనాలను భారీగా పెంచింది.

‘పిట్టగూడు లాంటి ఇంట్లో మేక పిల్లను ఏడ కట్టేసుకోవాలె? అల్లుడొస్తే ఎక్కడ పడుకోబెట్టాలె? పిల్లలు బట్టలెక్కడ మార్చుకోవాలె?’ అని గత స్కీములపై నిలదీశారాయన. అందుకే తన సర్కార్‌ రాగానే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఫ్రీగా కట్టించేస్తానన్నారు. ఆయన గెలుపులో ఈ పథకం ప్రకటన కీలకంగా పనిచేసిందంటే అతిశయోక్తి కాదేమో.

Advertisement

అప్పటి వరకు లబ్దిదారుల వాటాలతో కొనసాగే హౌజింగ్‌ స్కీములకు కొత్త నిర్వచనం ఇచ్చి తనదైన మార్కును వేశారు కేసీఆర్‌. ‘డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు… అదీ ఉచితంగా!’ ఆ ఊహే జనాలను ఆశల పల్లకిలో ఊరేగించింది. కానీ ఆచరరణలో ఘోరంగా విఫలమైందీ పథకం. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ ధరను నిర్ణయించకుండా రూ.5లక్షలకు ఒక ఇంటి నిర్మాణం చొప్పున కేటాయించారు. ఈ ధర కాంట్రాక్టర్ కు గిట్టుబాటు కాలేదు. దీంతో చాలా మంది, చాలా చోట్ల చేతులెత్తేశారు. దీంతో నిర్మాణాలు జరిగి మధ్యలోనే ఆగిపోయిన ఉదంతాలెన్నో ఉన్నాయి.

అసలు మొదలే పెట్టనివి కొన్ని కాగా, ఇంకొన్ని టెండర్ల దశలోనే ఆగిపోయిన దుస్థితి నెలకొన్నది. మధ్యంతరంగా ఆగిపోయినవి చాలానే ఉంటే.. వాటిలో కొన్నింటిని ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ బాగు చేసి లబ్దిదారులకు కేటాయిస్తోంది. ఇంకొన్ని చోట్ల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పూర్తయినా.. వాటిని లబ్దిదారులకు కేటాయించలేదు. వాటిని తమ ఎన్నికల కోసం వాడుకున్నది కేసీఆర్ సర్కార్.

Advertisement

రెండోసారి గెలిచేందుకు వీటినే చూపారు. లబ్దిదారుల సంఖ్య భారీగా ఉండటంతో కొందరికి ఇస్తే ఎంతో మందితో కంటు అవుతామని భయపడింది నాడు కేసీఆర్‌ సర్కార్‌. అందుకే ఎన్నికల కోసం దీన్ని వాడుకుని.. ఆ తరువాత సొంత స్థలం ఉంటే రూ. 5 లక్షలిస్తామన్నారు. ఆ తరువాత ‘మేమెప్పుడన్నాం.. రూ. 3 లక్షలే ఇస్తామ’ని అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారు.

ఆ తరువాత మొన్నటి ఎన్నికల్లో మళ్లీ రూ. 5 లక్షలిస్తామన్నారు. అయినా ఓడిపోయారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలనే ఇస్తోంది. నాలుగు దశలుగా ఐదు లక్షలను పనులు పూర్తయిన విధానాన్ని బట్టి బిల్లులు చెల్లిస్తున్నారు.  సర్కార్‌ ఇచ్చేది ఐదు లక్షలే అయినా.. మరో రెండు, మూడు లక్షలు అదనంగా అప్పులు చేసుకుని మరీ కట్టుకుంటున్నారు.

అయినా.. ఓ సొంతింటి వాళ్లమయ్యామనే సంతృప్తిని ఇస్తోంది ఈ పథకం. ‘ఆ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లతో పోల్చితే ఇది చాలా నయం.. కళ్లముందు మన ఇల్లు మనకు కనబడుతోంద’నే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇక ఇప్పుడు ఇందిరమ్మ టవర్స్‌ను జిల్లాలకూ విస్తరించాలనుకుంటున్నది సర్కార్‌. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, హనుమకొండ, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో వీటిని నిర్మించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకున్నది.

ఇప్పటికే హైదరాబాద్‌లోఈ టవర్స్‌కు మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఇక్కడా సబ్సిడీ ఐదు లక్షలే, జిల్లాల్లోని కార్పొరేషన్ల పరిధిలోనూ అవే ఐదు లక్షలు అని పెట్టడమే కొంత అసంతృప్తిని కలిగిస్తోంది జనాల్లో. సిటీలో సర్కార్‌ సబ్సిడీ పోను మరో రూ. 6 లక్షలు విడతల వారీగా చెల్లించే వెసులు బాటు కల్పించింది. సిటీలో ఇంత తక్కువ ధరకు అదీ ప్రైమ్ ల్యాండ్ లో  ఫ్లాట్‌ దొరకడమంటే పేదోడికి అది బంగారు అవకాశమే.

ఆ ఆరు లక్షలు అప్పులు చేసైనా చెల్లించేందుకు సిద్దమయ్యారు చాలా మంది. కానీ జిల్లాల్లోని నగరాల పరిధిలో సబ్సిడీ ఐదు లక్షలు పోను.. మరో రూ. 3.50 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కొంత విముఖత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఇవి ఎక్కడో ప్రభుత్వ స్థలాలున్న చోట.. నగర శివారులో కడతారు కాబట్టి.. అక్కడికి వెళ్లాలనుకోరు చాలా మంది. అందుకే హైదరాబాద్‌ సిటీలో మాదిరిగా జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్‌ సక్సెస్‌ కావడం కష్టమే. కానీ మరీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల స్కీం మాదిరిగా  ‘విఫల ప్రయోగం’గా మాత్రం ఉండదనేది స్పష్టం.

Tags

Related News

మీ ఫ్యాషన్.. హైదరాబాద్ భవిష్యత్తును బూడిద చేస్తోందా?

ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై బిగ్ డిబేట్.. 70 ఏళ్లుగా ఒకే వర్గానికి రిజర్వేషన్.. రొటేషన్ ఎందుకు లేదు?

నో రేషన్.. నో పెన్షన్? .. ఓటర్ ఐడీ లేకపోతే ప్రభుత్వ సాయం బంద్ కానుందా!

కాళేశ్వరం క్లైమాక్స్.. అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెడతారా? బీఆర్‌ఎస్ ప్లాన్ బి ఏంటి?

బీజేపీని గెలిపించడం కచ్చితంగా ప్రజల తప్పేనట! భావోద్వేగాలకు లొంగితే ఇలాంటి సీఎంలే వస్తారన్న పీకే! బీహార్‌ సీఎంపై ట్రోలింగ్స్‌..!

బంగాళాఖాతంలో మరో తుఫాను అలజడి.. ఆక్వాన్ వస్తుందా?

కరువు నేపథ్యంలో సర్కార్ పై బీఆర్‌ఎస్‌ పంజా! మరింత ఇరకాటంలో పెట్టేలా వ్యూహాలు! రైతు భరోసాతో రాజకీయం!

Big Stories

Advertisement
×