E-Paper
Advertisement

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !
Advertisement

బెంగాల్ ఫార్మూలా ఇక్క‌డ అమ‌ల్లోకి వ‌చ్చేసింద‌ని ఒప్పుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. భారీగా ఓట్ల గ‌ల్లంతు జ‌రిగిన త‌రువాత ఆయ‌న తొలిసారిగా దీనిపై స్పందించారు. మైనార్టీ ఎక్స్‌లెన్స్ స‌మ్మిట్‌లో ఆయ‌న మాట్లాడారు. బెంగాల్ ఫార్మూలా ఇక్క‌డ అమ‌లు చేయ‌బోతున్నార‌నే క్లారిటీ ఇచ్చారు ఈ వేదిక‌గా. గుజ‌రాత్ త‌ర‌హాలో దాడి కూడా షురూ కానుంద‌ని హింట్ ఇచ్చారు సీఎం.

అయినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, తానంటే ఏమిటో చూపిస్తాన‌నే విధంగా ఆయ‌న మాట్లాడిన తీరు.. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుంద‌నే సంకేతాలిచ్చిన‌ట్ట‌య్యింది. అన్ని విధాలుగా బ‌య పెట్టించి మమ‌త‌ను ఓడ‌గొట్టార‌న్న రేవంత్‌.. తాను మమత‌ను కాద‌ని, రేవంత్ అంటే ఏమిటో మీకు తెలియ‌చేస్తాన‌ని ఆయ‌న డైరెక్ట్ ఎటాక్ చెయ్య‌డం.. ఇక‌పై తెలంగాణ‌లో ఇరు పార్టీల యుధ్ద వాతావ‌ర‌ణం గురించి చెప్ప‌క‌నే చెప్పారు.

Advertisement

ఎన్నిక‌ల సంఘం ద్వారా స‌ర్ దాడి అయిపోయిన‌ట్టేన‌ని కూడా ప‌రోక్షంగా వెల్ల‌డించిన ఆయ‌న‌.. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌న్నారు. మొత్తంగా 70 ల‌క్ష‌ల ఓట్లు పోయిన‌ట్టేన‌ని కూడా ఒప్పుకున్నారు. సీబీఐ, ఈడీ పేర్ల‌ను కూడా ప్ర‌స్తావించిన రేవంత్‌.. ఇక వీటినీ ఉప‌యోగిస్తార‌నే విధంగా మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మోడీ, అమిత్ షాల చేతుల్లో ఉన్న‌వి ఇవే అస్త్రాల‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు. ఎన్ని కుయుక్తులు ప‌న్నినా .. బీజేపీకి ఇక్క‌డ చాన్స్ ఇవ్వ‌బోమ‌న్నారు. బీజేపీపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముస్లిం మైనార్టీలను కోరారు. ఓట్ చోరీపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అంద‌రికీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించి.. బీజేపీ ఎలా హ‌మ్లా చేయ‌నుందో వివ‌రించాల‌న్నారు.

బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన‌ట్టే క‌ల‌లు కుంటున్న‌ద‌ని,ఇంచు మించు బెంగాల్ త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ పెద్ద ఎత్తున ఓట్లు పోయాయ‌న్నారు. త‌మ‌కు అల‌వాటైన దోర‌ణిలో గుజ‌రాత్ త‌ర‌హా రాజ‌కీయ కుయుక్తుల‌కు దిగుతార‌ని, ఈసీఐ, సీబీఐ, ఈడీ .. ల‌ను ఉసిగొల్పుతార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

Advertisement

బీఆరెస్ దీనిపై ఇంత‌లా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. స‌ర్కార్ మాత్రం స‌ర్ తో ఓట్ల చోరీ జ‌రుగుతోంద‌ని బాహాటంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ .. బీజేపీని జ‌నం ముందు ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. దీంతో ఇప్పుడు వార్ కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్యేనా? అనేలా రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెలకొన్న‌ది.

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×