E-Paper
Advertisement

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..
Advertisement

జెన్‌జీని ప్ర‌ప‌న్నం చేసుకునే విష‌యంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లు పోటీలు ప‌డుతున్నాయి. కానీ బీఆరెస్సే ఇందులో ముందంజ‌లో ఉంటున్న‌ది. ఎక్క‌డ ఏ వేదిక‌గా మాట్లాడిన కేటీఆర్ ఓసారి జెన్‌జీ ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి యువ‌తను ఆక‌ట్టుకునేలా జెన్‌జీల పోరాటాల‌ను కూడా గుర్తు చేస్తూ వారిని కీర్తిస్తున్నారు.

ఆ ఉద్య‌మాల‌ను, ఆందోళ‌న‌ల‌కు త‌మ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా న‌ల్సార్ వ‌ర్సిటీలో నెల‌కొన్న‌వి వివాదాన్ని కూడా తన పార్టీలైన్ కింద‌కు తీసుకున్నాడు కేటీఆర్‌. అక్క‌డ జ‌రిగింది కూడా జెన్‌జీ త‌ర‌హా ఉద్య‌మ‌మే. విద్యార్థులంతా న‌ల్సార్ వ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వానికి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సూర్య‌కాంత్‌ను ముఖ్య అతిథిగా రానీయొద్ద‌ని లేఖ రాసిన ఉదంతం క‌ల‌క‌లం రేపింది. దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవ‌డం బార్ కౌన్సిల్‌లో వారిని ఎన్‌రోల్ చేయ‌మంటూ చేసిన ప్ర‌క‌ట‌న ఈ వివాద‌న్ని మ‌రింత పెంచింది.

Advertisement

మ‌ళ్లీ సీజేఐ ఈ వేడిని త‌గ్గించేలా కామెంట్స్ చేశారు. ఇది నాకు, విద్యార్థుల‌కు మ‌ధ్య వ్య‌వ‌హార‌మ‌ని, మ‌ధ్య‌లో మీరెందుకు జోక్యం చేసుకున్నారంటూ ఆయన ప‌రిస్థితిని కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వివాదానికి మెయిన్ కార‌ణం.. సీజేఐ నిరుద్యోగుల‌ను ఉద్దేశించి బొద్దింక‌ల‌ని కామెంట్ చేయ‌డం.. ఆ త‌రువాత జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద విద్యాశాఖ మంత్రిని నీట్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో రాజీనామా చేయాల‌ని చేసి ఆందోళ‌న విష‌యంలో కూడా కించ‌ప‌రిచేలా స్పందించ‌డంతో యువ‌త‌లో ఆయ‌న ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో న‌ల్సార్ యూనివ‌ర్సిటీలో కాన్వ‌కేష‌న్ ఉండ‌టం.. దీనికి సీజేఐ చీఫ్ గెస్ట్‌గా రానుండ‌టంతో ఇక్క‌డి విద్యార్థుల నుంచి స్పంద‌న వచ్చింది. ఇక్క‌డ ఇంత జ‌రుగుతున్నా కాంగ్రెస్‌లో మాత్రం దీనిపై ఇసుమంత కూడా చ‌ల‌నం లేదు. స్పంద‌న లేదు. కానీ తెలివిగా కేటీఆర్ దీన్ని త‌మ పార్టీకి అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Advertisement

వారి ఉద్య‌మానికి త‌మ సంఘీభావం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో హైద‌రాబాద్- రంగారెడ్డి- మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యూయేట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈసారి దీనిపై సీరియ‌స్‌గా దృష్టి పెట్టింది బీఆరెస్‌. ఈ స్థానం నుంచి బీఆరెస్ అభ్య‌ర్థిగా దివంగ‌త పీఎం పీవీ న‌ర్సింహారావు కూతురు సుర‌భి వాణి గెలిచిన విష‌యం తెలిసిందే. తాము గెలిచిన ఈ స్థానాన్ని మ‌ళ్లీ ద‌క్కించుకోవాల‌నే వ్యూహంలో భాగంగా జెన్‌జీ ఈ ఎన్నిక‌ల్లో కీలకంగా ఉన్న నేప‌థ్యంలో యువ‌త‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని కేటీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకే ఆయ‌న జెన్‌జీ మంత్ర‌ను విరివిగా వినియోగిస్తున్నారు.

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×