E-Paper
Advertisement

ప‌ది నామినేటెడ్ పోస్టుల‌కు ప‌చ్చ జెండా! కొలిక్కి వ‌చ్చిన క‌స‌ర‌త్తు..! టీజేఎస్ నేత‌ల‌కు చాన్స్ ఉండేనా?

ప‌ది నామినేటెడ్ పోస్టుల‌కు ప‌చ్చ జెండా! కొలిక్కి వ‌చ్చిన క‌స‌ర‌త్తు..! టీజేఎస్ నేత‌ల‌కు చాన్స్ ఉండేనా?
Advertisement

కాంగ్రెస్ నాయ‌కులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర కొనసాగ‌నుంది.దీనికి సీఎం ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు తెలిసింది. ప‌లుమార్లు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజాగా మ‌రోమారు దీనిపై చ‌ర్చించిన సీఎం .. ప‌ది నామినేటెడ్ ప‌ద‌వుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఆయా జిల్లాల వారీగా సీనియ‌ర్ నేత‌లు, మంత్రులు ఇచ్చిన లిస్టును అనుస‌రించి.. సామ‌జిక స‌మీక‌ర‌ణ‌లు, సీనియార్టీ, పార్టీ కోసం సిన్సియ‌ర్ ప‌నిచేసిన నేత‌లు.. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చివ‌ర‌గా ఓ ప‌ద మంది పేర్ల‌తో లిస్టును రెడీ చేసిన‌ట్టుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులతో పాటు బోర్డు డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయి సంస్థల పదవుల డ‌ భ‌ర్తీని వ‌డివ‌డిగా చేప‌డుతున్న‌ది స‌ర్కార్‌. చాలా మంది ప‌ద‌వుల‌ను ఆశించ‌డం.. వారంద‌రికీ స‌కాలంలో ప‌ద‌వులు ఇవ్వ‌లేక‌పోవ‌డం, జాప్యం జ‌ర‌గ‌డంతో కొంత అసంతృప్తి నెల‌కొన్న‌ది.

Advertisement

ఇప్ప‌టికే దాదాపు 40 మంది వ‌ర‌కు వివిధ కార్పొరేష‌న్లు, రాష్ట్ర స్థాయి ప‌దువుల భ‌ర్తీని చేప‌ట్టింది ప్ర‌భుత్వం. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో వీరి కాల ప‌రిమితి తీర‌నుంది. టెన్యూర్ ముగిసిన త‌రువాత మ‌ళ్లీ వారంద‌రికీ రెన్యూవ‌ల్ చేయ‌కుండా.. కొంద‌రికి మాత్ర‌మే చేసి.. మిగిలిన‌వి వెయిటింగ్ లిస్టులో ఉన్న‌వారికి ఇవ్వాల‌ని లెక్క‌లేసుకున్న‌ట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు ప‌ది మంది కొత్త‌వారికి ఇచ్చి.. మ‌రో మూడు నెల‌ల త‌రువాత ఖాళీ కాబోతున్న కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో కూడా అసంతృప్తుల‌కు, వెయిటింగ్‌లో ఉన్న సీనియ‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని భావిస్తోంది అధిష్టానం. తాజాగా ప‌ది మందితో కూడిన లిస్టు రెడీ అయ్యింది. అది ఇవాళో రేపో విడుద‌ల చేసేందుకు పీసీసీ చీఫ్ స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇందులో తెలంగాణ జ‌న స‌మితికి చెందిన నేతలున్నారా? అనేది స‌స్పెన్స్‌గా ఉంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ముందు టీజేఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడైన కోదండ‌రామ్‌తో టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాటిచ్చి ఉన్నారు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో టికెట్లు, ప‌ద‌వుల పంప‌కాల్లో టీజేఎస్‌కు ప్ర‌యార్టీ ఇస్తామ‌ని చెప్పి ఉన్నారు. దీంతో ప‌లు మార్లు ఇదే అంశంపై కోదండ‌రామ్‌తో క‌లిసి సీఎంను, పీసీసీ చీఫ్‌ను, ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను టీజేఎస్ నేత‌లు క‌లిశారు. స‌ర్కార్‌కు మిత్ర ప‌క్షంగా ఉన్న త‌మ‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌ద‌వుల్లో అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతూ వ‌చ్చారు.

Advertisement

ప్ర‌ధానంగా టీజేఏస్ లో ఉన్న యువ నేతలు సలీమ్ పాషా, మాసంపల్లి అరుణ్ కుమార్, రమేష్ ముదిరాజ్, ఆశప్పలు పదవులు ఆశిస్తున్నారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.‌ తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పోరాటాలు చేశారు.ఆ పార్టీలో కీల‌క హోదాల్లో ఉన్నారు. తాజా లిస్టులో టీజేఎస్ నేత‌లున్నారా? ఆ త‌రువాత క్ర‌మంలో విడుద‌ల చేసే జాబితాలో ఎవ‌రెవ‌ర‌కి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌నే అంశం ఇప్పుడు ఆస‌క్తిని రేపుతోంది. గాంధీభ‌వ‌న్ నుంచి ఎప్పుడు ఏ స‌మాచారం వ‌స్తుందా అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది.

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×