E-Paper
Advertisement

బయటకొచ్చిన వైసీపీ కాక్రోచ్‌లు.. రోడ్లపై నిరాహార దీక్షలు.. ఎక్కడో కొడుతోంది శీనా..!

బయటకొచ్చిన వైసీపీ కాక్రోచ్‌లు.. రోడ్లపై నిరాహార దీక్షలు.. ఎక్కడో కొడుతోంది శీనా..!
Advertisement

YSRCP DSC Protest: పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న చందంగా వైసీపీ తీరు కనిపిస్తోంది. ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీ రోడ్లపై పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకు దిగిన తెలిసిందే. విద్యార్థులు, యువత భారీగా సంఘీభావం తెలపడంతో కేంద్రం తలొగ్గకతప్పలేదు. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సీజేపీ ఫార్మూలానే వైసీపీ పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. డీఎస్సీ అక్రమాల పేరుతో లోకేశ్ రాజీనామాకు పట్టుబడుతోంది. ఆ పార్టీ శ్రేణులు ఇవాళ (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు సైతం చేపట్టారు.

అయితే ‘ఎక్కడో కొడుతోంది శీనా’ అన్న సినిమాల్లోని ఫేమస్ డైలాగ్.. వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసనలకు యువత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి కదం తొక్కారు. కానీ మెగా డీఎస్సీ -2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ వైసీపీ ఆరోపిస్తోంది తప్పా.. దానికి తగ్గ ఆధారాలను ఇంతవరకూ ఆ పార్టీ బయటపెట్టలేకపోయింది.

Advertisement

దాదాపు నెల రోజుల క్రితం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులతో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించి.. మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ జాబ్ కోల్పోయిన బాధితుల గోడు విన్నారు. అయితే జగన్ వద్ద పలువురు అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆ మర్నాడే ఏపీ ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రెస్ మీట్ నిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చేశారు. ఏ కారణం చేత జాబ్ రాలేదో పూసగుచ్చినట్లు మీడియా ముఖంగా వివరించారు. బాధితులకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే దానిని నివృత్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉందన్నారు. దీంతో అప్పటివరకూ హడావిడీ చేసిన అభ్యర్థులు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

కానీ వైసీపీ మాత్రం.. మెగా డీఎస్సీలో ముమ్మాటికీ స్కామ్ జరిగిందనీ ఆరోపిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఇటీవలే ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలు చేశారు. ఇక్కడే హైకోర్టు.. సదరు వైసీపీ ఎమ్మెల్సీకి చివాట్లు పెట్టినంత పనిచేసింది.

Advertisement

డీఎస్సీ వల్ల నష్టపోయామని చెబుతున్న విద్యార్థులు ఎక్కడా అని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. వారు భయపడుతున్నారని పిటిషనర్ తరపు లాయర్ చెప్పగా హైకోర్టు ఏమాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. పైగా అక్రమాలు జరిగాయంటూ మీవద్ద స్పష్టమైనా ఆధారాలు ఉంటే చూపండి అంటూ సూటిగా ప్రశ్నించింది. దానికి సరైన సమాధానం రాలేదు. న్యాయవాది నీళ్లు నములుతూ పిటిషనర్ ను అడిగి చెబుతానని కోర్టుకు ఆన్సర్ ఇచ్చి జారుకున్నారు.

Also Read: విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా – మల్లాది విష్ణు వర్గాల తోపులాట.. డీఎస్సీ దీక్షలో హై టెన్షన్!

కాగా, డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పే స్ట్రాంగ్ ఎవిడెన్స్ వైసీపీ వద్ద లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినప్పటికీ నిరహార దీక్షలు పేరుతో రోడ్లపైకి రావడం ఏంటన్న ప్రశ్న తటస్థ ఓటర్ల నుంచి సైతం వ్యక్తమవుతోంది. పైగా మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదని.. దీనిపై జగన్ తో బహిరంగ చర్చకు సిద్ధమని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇప్పటికే సవాలు విసిరారు. దానిపై వైసీపీ అధినేత నుంచి ఇప్పటికీ స్పందనలేదు. అది వదిలేసి దీక్షల పేరుతో హడావిడీ చేయడం ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. దీని వల్ల వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Also Read: BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

Tags

Related News

కాంగ్రెస్‌లో బీఆరెస్ విలీనం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌రా? అందుకే కేసీఆర్ వెన‌కడుగు వేశాడా?

తెలంగాణ జాతిపిత కేసీఆర్‌..! మ‌ళ్లీ కేటీఆర్ నోటి వెంట ఫాద‌ర్ ఆఫ్ తెలంగాణ‌ కామెంట్స్‌..

ఫ్రీ బ‌స్సు కావాలి.. ప్రైవేటు బ‌డుల‌కు పోవాలి! స‌ర్కారీ చ‌ద‌ువులపై ఇంకా గురి కుద‌ర‌లే! వైద్య‌మూ అంతే..

మేం తిడితే ఓకే.. ఎవ‌రు తిట్టినా కేసే! మోడీని తిడితే ఊరుకోం.. ఆయ‌న మ‌న ప్ర‌ధాని..!

కేటీఆర్, అర్వింద్ .. ఇద్ద‌రి నోటా ఒకే మాట‌! రేవంత్ టార్గెటెడ్‌గా కామెంట్స్‌.. పార్టీ లైన్ దాటి ప‌ర్స‌న‌ల్ అటాక్‌..!

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!

మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?

Big Stories

Advertisement
×