E-Paper
Advertisement

ప్రియాంక సింప్లిసిటీపై ప్ర‌శంస‌లు! ఆమె భాషే కాదు.. వేషధార‌ణా భేష్‌!!

ప్రియాంక సింప్లిసిటీపై ప్ర‌శంస‌లు!  ఆమె భాషే కాదు.. వేషధార‌ణా భేష్‌!!
Advertisement

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పాస్ కాకుండా ఆపార‌నే గ‌గ్గోలు న‌డుస్తున్న క్ర‌మంలో ప్ర‌ధానంగా ఓ మ‌హిళ గురించి డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఆమె సింప్లిసిటీపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఆమే ప్రియాంక గాంధీ. ఆమె తాజాగా జ‌రిగిన పార్ల‌మెంటు ప్ర‌త్యేక సెష‌న్‌లో మాట్లాడిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. వాస్త‌వానికి ప్రియాంక గాంధీ ప్ర‌సంగాల‌ను దేశంలో చాలా మంది చూసి ఉండ‌రు. కానీ.. ఈ ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌రిగిన నేప‌థ్యం .. అంద‌రిలో ఉత్కంఠను రేపింది. ఏం జ‌రుగుతుంది? బిల్లు పాస‌వుతుందా? మోడీ, అమిత్ షాలు ఏం మాయ చేస్తారు? వారికి స‌రిప‌డా బ‌లం లేదు క‌దా! ఇవ‌న్నీ.. చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అందుకే ఎవ‌రు మాట్లాడినా ఆస‌క్తిగా గ‌మ‌నించారు.

అందులో ప్రియాంక స్పీచును కూడా ఆసాంతం విన్నారు. ఆమె మాట్లాడిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. రాజ‌కీయ విమ‌ర్శకుల‌ను, ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా ఆమెకు ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ ప‌రిణామం అనంత‌రం ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. సింపుల్‌గా ఆమె కాట‌న్ చీర క‌ట్టుకుని, చేతిలో చిన్న బ్యాగుతో ఎలాంటి ఆడంబ‌రం, హంగూ ఆర్బాటాలు లేకుండా.. సామాన్య మ‌హిళ‌లా ఉన్న ఫోటోల‌ను షేర్ చేసుకుంటున్నారు. ఎంత సింప్లిసీటీ ప్రియాంక‌ది. ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు. ఇదే కాబోలు. ఈమెను చూసి నేర్చుకోవాలి.. నేటి రాజ‌కీయ మ‌హిళానేత‌లు.. అనే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఆమె క‌లిసిపోయే తీరు, సాదాసీదా దుస్తులు, ఆడంబరాలకు దూరంగా ఉండే స్వభావం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్ద పెద్ద రాజకీయ నేతలకు ఉండే భద్రతా హడావుడి, ప్రోటోకాల్ మధ్య కూడా సాధారణ మహిళలా ప్రవర్తించడం ఆమె ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకుంటున్నారు.

Advertisement

రాహుల్ గాంధీ సైతం ఆమె మాట్లాడిన తీరును మెచ్చుకున్నారు. త‌న‌కు ఎంతో గ‌ర్వంగా అనిపించింద‌ని పార్ల‌మెంటు సాక్షిగా త‌న అభిప్రాయాన్ని తెలిపారు. అమిత్ షా.. రాహుల్ మాట్లాడిన తీరును విమ‌ర్శించే క్ర‌మంలో ప్రియాంక గురించి ప్రస్తావించారు. స‌భ‌లో ఎలా మాట్లాడాలో ప్రియాంక‌ను చూసి నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఎందుకంటే ఆమె .. అమిత్ షాను ఉద్దేశించి రాజ‌కీయ చాణ‌క్యుడ‌ని పొగ‌డుతూనే ..త‌మ‌కు అనుకూలంగా చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న చేయ‌డంలో దిట్ట అనే విధంగా ప‌రోక్షంగా విమ‌ర్శించారు.దీనికి అమిత్ షా కూడా నవ్వుకున్నారు.

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×