E-Paper
Advertisement

ఎన్టీఆర్, కేసీఆర్,చంద్రబాబు…! రాజకీయ పరిణామక్రమంలో రంగులెలా మారాయ్..!

ఎన్టీఆర్, కేసీఆర్,చంద్రబాబు…! రాజకీయ పరిణామక్రమంలో రంగులెలా మారాయ్..!
Advertisement

కేసీఆర్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఇందులో డౌట్ లేదు. అత‌ని కొడుకుకు తార‌క రామారావు అని పేరు పెట్టుకునేంత అభిమానం. నిన్న రేవంత్‌రెడ్డి అన్న‌ట్టుగా కేసీఆర్‌కు ఎన్టీయారే రాజ‌కీయ భిక్ష పెట్టాడు. ఇంకో మాట కూడా అన్నాడు. ఎంతో మంది లీడ‌ర్ల‌ను ఎన్టీఆర్ తెలంగాణ‌కు అందించాడ‌ని. అందులో కేసీఆర్‌ను పేరు కూడా తీసుకున్నాడు రేవంత్‌. కానీ ఎంతో మంది మ‌హాలీడ‌ర్లు అని అంద‌రినీ సంబోధించి.. కేసీఆర్‌ను మాత్రం.. ఆ మాట‌న‌లేక‌పోయాడు. ప్ర‌ధాన ప్ర‌త్యర్థి కావ‌డంతో. కానీ ఎన్టీఆర్‌ను ఏనాడూ కేసీఆర్ వ్య‌తిరేకించ‌లేదు. త‌న అప్ప‌టి అభిప్రాయాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. కేసీఆర్‌కు ఉన్న గొడ‌వంతా చంద్ర‌బాబుతోనే. చంద్ర‌బాబును అవ‌స‌ర‌మున్న‌ప్పుడు ఆకాశ‌నికెత్తాడు.

అత‌ను మంచి అడ్మినిస్ట్రేట‌ర్ అని పొగ‌డొచ్చు గాక‌! కానీ త‌న రాజ‌కీయ పంథాలో, త‌ను ఎంచుకున్న మార్గంలో చంద్ర‌బాబు ఎప్పుడూ ఆటంక‌మేన‌ని గుర్తించాడు కేసీఆర్. బాబుకు అలా.. మామ ఎన్టీఆర్ చేసుకున్న కొన్నిచ‌ర్య‌ల వ‌ల్ల అయాచితంగా సీఎం ప‌ద‌వి వ‌చ్చిప‌డిందే త‌ప్ప‌.. అందులో చంద్ర‌బాబు రాజ‌నీతిజ్ఞ‌త ఏమాత్రం లేద‌ని, అత‌నికి సీఎం అయ్యే ల‌క్ష‌ణాలు కూడా లేవ‌ని గ‌ట్టిగా న‌మ్మేవాళ్ల‌లో కేసీఆర్ ముందుంటాడు. ఇందులో డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మ‌హాకూట‌మి పేరుతో టీడీపీతో జ‌త‌క‌ట్టినా.. చంద్ర‌బాబుతో జై తెలంగాణ అని అనిపించినా అవ‌న్నీ కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు. చంద్ర‌బాబు త‌న అప్ప‌టి రాజకీయ అవ‌స‌రాల కోసం అన‌క‌త‌ప్ప‌లేదు.

Advertisement

ఆయ‌నంతే .. బ‌త‌క‌నేర్చిన లీడ‌ర్‌. అందుకే తిట్టిన వారిని కూడా ద‌గ్గ‌రికి చేర్చుకుంటాడు. సేమ్‌.. కేసీఆర్‌లాగే. ఉద్య‌మ స‌మ‌యంలో అంద‌రినీ క‌లుపుకుపోయే క్ర‌మంలో గొంగ‌ళిపురుగును కూడా ముద్దాడుతాన‌న్నాడు. అదే నోటితో లంక‌లో పుట్టినోళ్లంతా రాక్ష‌సులేన‌ని ఆంధ్రా వాళ్ల‌నుద్దేశించి ఘాటు కామెంట్స్ చేశారు. ఆ త‌రువాత అధికారంలోకి రాగానే .. సీఎం కాగానే .. సెటిల‌ర్ల కాళ్ల‌కు ముల్లు గుచ్చితే త‌న నోటితో తీస్తాన‌న్నాడు. అదీ రాజ‌కీయం అంటే. అంతే. ఎన్టీఆరే వీరికి విభిన్నం కానీ. కేసీఆర్‌కు, చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి. ఎన్టీఆర్ త‌ను అనుకున్న సంస్క‌ర‌ణ‌లు రాజ‌కీయాల్లో తీసుకురాగ‌లిగాడు. త‌నో చ‌రిత్ర సృష్టించాల‌నుకున్నాడు. త‌నదైన పాల‌న‌ను, విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులను తీసుకురావాల‌నుకున్నాడు.. తీసుకొచ్చాడు. కానీ అది కేసీఆర్‌కు, చంద్ర‌బాబుకు సాధ్యం కాదు. వీరు .. ఎప్ప‌టికా అవ‌స‌రాల‌ను బ‌ట్టే త‌మ రాజ‌కీయ స్టాండ్‌ల‌ను మార్చుతూ ఉంటారు.ఊస‌ర‌వెళ్లి రాజ‌కీయాల‌కు ఏమాత్రం తీసిపోరు. కానీ నీకంటే నేనే మేధావిన‌ని కేసీఆర్ అనుకుంటాడు.

నీకంటే నేనే సీనియ‌ర్‌.. నాకిందే నువ్వు ప‌నిచేశావ‌ని చంద్ర‌బాబు అనుకుంటాడు. ఇద్ద‌రికీ ఈగోలున్నాయి. రాజ‌కీయ ప‌ద‌వీకాంక్ష ఉంది. వారసుల‌ను సీఎం చేయాల‌నే త‌ప‌న ఉంది. దాని కోసం త‌మ సిద్దాంతాలు పాత చింత‌కాయ ప‌చ్చ‌డి కింద ప‌చ్చ‌డి ప‌చ్చ‌డిగా చిత‌గ్గొట్ట‌గ‌ల‌రు. కొత్త ఆవ‌గాయ పెట్టుకుని రుచి చూపించ‌గ‌ల‌రు. బీజేపీతో జ‌త క‌ట్ట‌గ‌ల‌రు. అంతిమంగా వార‌సుల‌ను సీఎం చేయ‌డ‌మే ఇప్పుడీ ఇద్ద‌రు చంద్రుల ముందున్న త‌క్ష‌ణ రాజ‌కీయ క‌ర్త‌వ్యం. ఇప్పుడిదంతా ఎందుకంటే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిట్ట‌డం కోసం ఆ సంద‌ర్బాన్ని ఎంచుకున్నాడు గానీ, రేవంత్ కూడా అందుకు అతీతుడేమీ కాదు. రేవంత్‌కు వారిద్ద‌రికీ ఉన్న ఒకే ఒక్క తేడా.. వార‌స‌త్వ రాజ‌కీయాలు లేక‌పోవ‌డ‌మే. మిగిలిన‌దంతా సేమ్‌టు సేమ్‌. త‌ను మ‌రోసారి సీఎం కావాల‌నుకుంటున్నాడు.

Advertisement

ఆ త‌రువాత పార్టీ ఎటుపోయినా.. ప్ర‌భుత్వం రాక‌పోయినా.. త‌న భ‌విష్య‌త్తు రాజ‌కీయం ఢిల్లీకి మారిపోయినా.. ప‌రిణామాలు ఎలా మారినా.. ఆ త‌రువాత సంగ‌తి త‌రువాత‌. అందుకే అవ్వ‌కావాలి.. బువ్వ‌కావాలి.. కాన్సెప్ట్‌లో రేవంత్ పోతున్నాడు. అందుకే చంద్ర‌బాబు ఆశీస్సులు త‌న‌కున్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పుకుంటున్నాడిలా. హైద‌రాబాద్‌లో త‌న ద్వారా పార్టీని పాగా వేయించే వ్యూహంలో అది భాగ‌మై ఉండొచ్చు కానీ.. రేవంత్ కాంగ్రెస్‌ను కల్తీ చేశాడ‌ని క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు మాత్రం విమ‌ర్శించారు. ఇప్పుడు ఈ విమ‌ర్శ‌లేమీ ప‌ట్టించుకోడు రేవంత్‌. త‌న టార్గెట్ మ‌ళ్లీ సీఎం కావ‌డం అంతే. దాని కోసం ఏమైనా చేస్తాడు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌లోపు మ‌రిన్ని ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టినా పెడ‌తాడు. చేసిన అభివృధ్ది చెప్పుకోవ‌డానికి లేన‌ప్పుడు… ఏదో ఒక రాజ‌కీయ అస్త్ర‌మైతే ఉండాలె క‌దా! అందుకే అన్న‌గారి మీద ఎంత రాజ‌కీయం న‌డిస్తే అంత మేలు! అధికార పార్టీకి.

Related News

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

రెడ్‌బుక్ బెదిరింపులు వ‌చ్చు..! ప్లీజ్ మా ఏపీకి రండని బ‌తిమాల‌డ‌మూ వ‌చ్చు..!

Big Stories

Advertisement
×