E-Paper
Advertisement

2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన శపథం

2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను..  సీఎం రేవంత్ రెడ్డి సంచలన శపథం
Advertisement

Revanth Challenge: స్వేచ్ఛ బ్యూరో: కేసీఆర్ కు 2029 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయను అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడగొట్టామని, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న వచ్చేలా చేశామని సీఎం వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో పాతరేస్తే, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికల్లో గోడి కట్టానని సీఎం వివరించారు. దమ్ముంటే కాస్కోవాలని, తేల్చుకుందామని సీఎం ఛాలెంజ్ చేశారు.

సీఎం శపథం

Advertisement

కేసీఆర్ ను 2029లో ప్రతిపక్ష హోదా కేసీఆర్​ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేర్చుకుంటానని సీఎం శపథం చేశారు.2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పటడమే కాకుండా 17 పార్లమెంట్ స్థానాల్లో హస్తం పార్టీని గెలిపించి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయాలని సీఎం కోరారు. ఇందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు నిచ్చారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్నారు. సభావేదిక పైనుంచి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు.

సీఎం మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఇక రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి సంవత్సరంలోపే చేసి చూపించామని సీఎం తెలిపారు. 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని, గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామని వెల్లడించారు. ఇప్పుడు రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. తెలంగాణలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన గతంలో ఎవరికైనా వచ్చిందా? ప్రశ్నించారు.

పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు…?

ప్రజాపాలన పోవాలని పాపాల భైరవుడు రావాలని అని ఒక పెద్దమనిషి అంటున్నారని రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని కొనియాడారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని, జీవన్‌రెడ్డి చరిత్ర, ఆయన వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసనని అన్నారు.

జీవన్ రెడ్డిపై సీఎం పైర్

40 సంవత్సరాల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్‌ పార్టీ బీ ఫామ్‌ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయారని, ఓడిపోయినప్పటికీ ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను గౌరవించిందని తెలిపారు. సంవత్సరం పాటు పదవి లేకపోతే జీవన్‌రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని వెల్లడించారు. నాందేళ్ల భాస్కర్ రావుతో కలిసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసిన చరిత్ర జీవన్ రెడ్డిది అంటూ సీఎం మండిపడ్డారు. తన కుటుంబం, తాను మాత్రమే పదవులు పొందాలని చూసి, జగిత్యాలలో ఇతర లీడర్లను తొక్కేశారన్నారు.

ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు

70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రజాప్రభుత్వం పోవాలా? అని ప్రశ్నించారు. ఒక్కాయనకు పదవి రాకపోతే ప్రజా ప్రభుత్వం పోవాలా? నేరెళ్లలో ఎస్సీలను ఇసుక లారీలతో తొక్కించినందుకు పాపాల భైరవుడు మళ్లీ రావాలా? ప్రశ్నించారు. వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయం కూల్చి కొత్తగా కట్టుకున్నారని, బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? అని అడిగారు. పేదలు దొరల గడీల ముందు ఊడిగం చేస్తూ అలాగే ఉండాలని భావించారని, పేదలు కట్టుకోవడానికి పనికిరాని బతుకమ్మ చీరలు పంచారని పేర్కొన్నారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించి పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. సమ్మక్క- సారలమ్మ దేవతలను ఏనాడైనా దర్శించుకున్నారా? అని ప్రశ్నించారు.

చట్టాలు లేకపోతే చెట్టుకు కట్టేసి ఊరేసేవాళ్లం..

కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లను కేసీఆర్ గోదావరిలో పోసి వృథా చేశారని సీఎం చెప్పారు. కాళేశ్వరం పేరిట చేసిన దోపిడీకి కేసీఆర్‌కు ఉరి వేసినా తప్పులేదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరం అయ్యిందన్నారు. చట్టాలు లేకపోతే చెట్టుకు కట్టేసి ఊరేసేవాళ్లమని సీఎం మండిపడ్డారు. పాపాల భైరవుడు పాలనలో అన్ని పాపాలేనని సీఎం చెప్పారు. ప్రజాప్రభుత్వంలో ఒక్కో వ్యవస్థను సర్దుబాటు చేస్తున్నామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు.

టీపీసీసీ చీఫ్​, నేను కలిసి అధికారం తెస్తాం..

తన మిత్రుడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఇద్దరం కలిసి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారం లోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉన్నదని, 1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉండగా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదన్నారు. 2014 నుంచి 2 సార్లు బీఆర్ ఎస్ గెలిచిందని, 2023లో కాంగ్రెస్ గెలిచిందని సీఎం గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. భవిష్యత్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగుతానని సీఎం చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ పవర్ లోకి రావడం ఖాయమని సీఎం నొక్కి చెప్పారు.

Also Read: కేసీఆర్ చాప్టర్ క్లోజ్.. జైలుకు పంపడం ఖాయం.. బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు

Related News

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

Big Stories

Advertisement
×