E-Paper
Advertisement

TG : జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?

TG : జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?
Advertisement

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. నిధులు లేక సంక్షేమ పథకాల అమలులోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకా ముందు చూడకుండా ఉచిత పథకాలు, సంక్షేమం, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విచ్చలవిడిగా రుణాలు తీసుకుని వచ్చి ఖర్చు చేసింది. దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రస్తుతం అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు నిధులు లేక రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.

పెరుగుతున్న అసంతృప్తి..

రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు మీద గరం అవుతున్నారు. తమకు పే స్కేల్ అమలు చేయడం లేదని, డీఏ, హెచ్ ఆర్ ఏ పెంచాలని కోరుతున్నారు. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. బెనిఫిట్స్ కోసం పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు రాకముందే తెలంగాణలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని సీఎం రేవంత్ పలుమార్లు ప్రస్తావించారు.నాటి నుంచి పెండింగ్ బకాయిల పంచాయితీ నడుస్తున్నది.తమకు న్యాయంగా దక్కాల్సిన ప్రమోషన్స్, వేతనాల పెంపు జరగకపోతామని ఉద్యమిస్తామని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమస్యలకు సర్కార్ చెక్ పెట్టగా.. ఆర్టిజన్ల నిరసనలు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.

రూ.1000 కోట్ల భారం..

Advertisement

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడకూడదని రేవంత్ సర్కార్ ఒకమెట్టు దిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని అధికారుల బృందం జేఏసీ నాయకుల డిమాండ్లను పరిష్కరించింది. పే స్కేల్‌తో పాటు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కోసం కమిటీ వేసినట్టు ప్రభుత్వంపేర్కొన్నది. ఆ కమిటీ నివేదికకు అనుగుణంగా విలీన ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, కేసీఆర్ హయాంలోనే తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ఉద్యమించగా.. నాడు పెద్దగా పట్టించుకోలేదు. వారి జీతాలు పెంపు విషయంలోనూ పెద్దగా ఏమీ చేయలేదు. నాడు సమస్యల పరిష్కారం కోసం సుమారు నెల రోజులుకు పైగా నిరసనలు తెలిపినా కేసీఆర్ లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత కార్మికులతో కలిస భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

Advertisement

తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేసింది. పెండింగ్ బకాయిలు సైతం చెల్లించేందుకు సిద్దమైంది.ఈ మేరకు తాజా వేతన పెంపుతో సర్కారుపై రూ.1000 కోట్ల భారం పడనుంది. మరల ఈ నిధులు ఏ శాఖ నుంచి తీసుకోవాలి. ఎలా అడ్జస్ట్ చేయాలి.. రుణాలు తీసుకోవాలా?లేక మరోసారి బస్ చార్జీలు పెంచుతారా? అనే అయోమయాన్ని సామాన్య ప్రజానీకానికి కాంగ్రెస్ సర్కార్ మిలిగ్చింది. నిధులు లేకపోతే ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కానున్నాయి.ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ సైతం త్వరగా చెల్లించాలని సర్కార్ భావిస్తున్నది. వాటికి సైతం వందల కోట్లలో డబ్బులు కావాలి. అందుకోసం రేవంత్ సర్కార్ ఏం చేస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×