E-Paper
Advertisement

ఆటోల‌మ్ముకోవ‌డం హైలెట్ అంట‌… నీ వ‌ర్ణ‌న మ‌రీ అతి రామ‌న్నా!

ఆటోల‌మ్ముకోవ‌డం హైలెట్ అంట‌… నీ వ‌ర్ణ‌న మ‌రీ అతి రామ‌న్నా!
Advertisement

ఎందుకో కేటీఆర్ మెంట‌ల్‌గా ఏమైనా డిస్ట‌ర్బ్ అయ్యాడేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. లేక‌పోతే ఆయ‌న మాట్లాడే శైలే అట్లుంట‌దా? ఓడిపోయిన త‌రువాత అది మ‌రీ ఎక్కువై ఇలా ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటుందా? స‌రే, విష‌యానికొద్దాం. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ మే డే వేడుక‌లు జరిగాయి. కేటీఆర్ హాజ‌ర‌య్యాడు. కార్మికుల క‌ష్టాలు చెప్పే క్ర‌మంలో, స‌ర్కార్ ప‌ట్టించుకోని త‌నాన్ని విడ‌మ‌ర్చి వివ‌రించే క్రమంలో ఓ చిన్న సంఘ‌ట‌న చెప్పాడు. సంగారెడ్డికి చెందిన ఓ ఆటో డ్రైవ‌ర్‌.. మ‌ష్ర‌త్ అలీ కి కాంగ్రెస్ అధికారంలోకి రాక‌ముందు రెండు ఆటోలుండేవ‌ట‌.

ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఇక్క‌డికి వ‌చ్చిన రాహుల్ గాంధీ.. మ‌ష్ర‌త్ అలీ ఆటో ఎక్క‌డట‌. ఇప్పుడా మ‌ష్ర‌త్ అలీ రెండు ఆటోలు అమ్ముకున్నాడ‌ట‌. కిరాయి ఆటో నడిపించుకుంటున్నాడ‌ట‌. ఆ ముచ్చ‌ట కేటీఆర్ చెప్పే విధానంలోనే ఏదో తేడా కొట్టింది. ఆ విష‌యం చెబుతున్న‌ప్పుడు.. చెప్పిన త‌రువాత ఆ ముఖంలో ఓ ఆనందంతో కూడిన న‌వ్వు క‌నిపించింది. ఆ న‌వ్వుతో పాటే రాహుల్‌ది ఐరెన్ లెగ్ అని చెప్పాడు కేటీఆర్‌. రాహుల్‌ది ఐరెన్ లెగ్ అని ఆనందంగా చెప్పాల‌నుకున్నాడేమో కానీ.. అక్క‌డ రెండు ఆటోలు అమ్ముకున్న వాడి బాధ క‌నిపంచ‌లేదు.

Advertisement

అత‌డి మీద క‌నీసం జాలి కూడా ఆ మాట‌ల్లో క‌నిపించ‌లేదు. స‌రే, దీన్ని రాజకీయంగా త‌న‌కు అనుకూలంగా వాడుకోవ‌డానికి అప్ప‌టి ముచ్చ‌ట‌ను తీశాడ‌నుకుందాం.ఆ ఆనందం ఎందుకు..? ప‌నిలో ప‌ని నీకు అల‌వాటైన దోర‌ణిలో మంచిగైంది… మీకు అట్ల‌నే కావాలె.. మేము చెబితే విన్న‌రా? అనుభ‌వించండి.. అని అన‌క‌పోయారా? బ‌హుశా నిబాయించుకుని ఉంటాడు. ఏ వేదిక‌లెక్కినా ఇవే ముచ్చ‌ట్లు చెబుతున్నాడు కేటీఆర్‌. జనం మీద ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్న‌ట్టుగానే ఉంటున్నాయా ప‌లుకులు. చిలుక‌కు చెప్పిన‌ట్టు చెప్పినం విన్నారా? రైతు బంధు 14 సార్లు వేసినం.. అయినా మీకు ప‌ట్టింపు లేదు.. ఇంట్ల‌కెళ్లి వేస్తున్న‌డా కేసీఆర్! అని అనుకున్న‌రు. ఇప్పుడు బాగైందా? అని న‌వ్వుకుంటున్నాడు.

పైశాచికానందం పొందుతున్న‌ట్టే అంటున్నాడు. ప‌దేండ్ల‌కొక‌సారి పంట మార్పిడి అని అంటున్నారు. ఎట్ల చేస్త‌రు పంట మార్పిడి.. బాగ‌నే ఉంది క‌దా! అని కూడా అంటున్నాడు. అంటే జనం ఎవ‌రికి ఓటేయాలో కూడా మీరే చెబ‌తారా? నిర్బంధంగా మాకే ఓటేయాల‌ని చెబుతున్నారా? స‌మ‌స్య‌ల‌న్నీ వ‌దిలి జ‌నం మీద ప్ర‌తీకార తీర్చుకున్నట్టుగానే ఉంటుంది కేటీఆర్ మాట‌ల తీరు. అందుకే అత‌డు న‌చ్చ‌డం లేదింకా జ‌నానికి. కేటీఆర్ పెద్ద‌రికాన్ని అందుకే అంగీక‌రించ‌డం లేదు జ‌నం. సీఎం స్థాయి సీన్ లేద‌ని అప్ప‌ట్లోనే తిర‌స్క‌రించారు. ఇప్ప‌టికీ మంచి మార్కులు పొంద‌లేక‌పోతున్నాడు. ఇలాంటి వైఖ‌రినే కొన‌సాగిస్తూ.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×