E-Paper
Advertisement

పసుపు రైతులకు న్యాయం చేయాలి.. క్వింటాల్‌కు రూ.16 వేల ఎంఎస్‌పీ డిమాండ్ చేసిన కవిత

పసుపు రైతులకు న్యాయం చేయాలి.. క్వింటాల్‌కు రూ.16 వేల ఎంఎస్‌పీ డిమాండ్ చేసిన కవిత
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పసుపు రైతులకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక డిమాండ్లు చేశారు. పసుపును తక్షణమే ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ.16 వేల మనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని ఆమె కోరారు. నిజామాబాద్ జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటాల్ పసుపు ధర రూ.17 వేలు పలుకుతుండగా.. నిజామాబాద్ మార్కెట్‌లో మాత్రం వ్యాపారుల సిండికేట్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ క్వింటాల్‌కు రూ.13 వేలకు మించి ధర లభించడం లేదని దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు తీరుపై కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బోర్డు కేవలం ఉత్సవ విగ్రహంలా మారిందని.. దీనివల్ల రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. స్పైసెస్ బోర్డును మరింత బలోపేతం చేసి నిజామాబాద్.. జగిత్యాల.. నిర్మల్ జిల్లాల్లోని పసుపు రైతులను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పసుపును ఆహార పంటల జాబితాలో చేర్చడం వల్ల రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర లభించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ మార్కెట్‌లో ఇంకా నిల్వ ఉన్న సుమారు లక్ష క్వింటాళ్ల పత్తిని కూడా ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని ఆమె కోరారు.

Advertisement

డిజిటల్ మార్కెటింగ్ విధానం ‘ఇ-నామ్ 2.0’ (e-NAM 2.0) అమలులో జరిగిన పొరపాట్ల వల్ల పసుపు రైతులు నష్టపోయారని కవిత గుర్తు చేశారు. ప్రారంభంలో నిజామాబాద్ మార్కెట్‌ను ఇందులో చేర్చకపోవడం.. ఆ తర్వాత చేర్చినప్పటికీ ఆన్‌లైన్ వివరాల నమోదులో ఉన్న సంక్లిష్టతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడం వల్లే గడిచిన ఏడేళ్లుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పసుపు పంటకు దూరమవ్వకముందే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కవిత స్పష్టం చేశారు. పసుపు సాగు చేసే రైతుల శ్రమకు తగిన ఫలితం అందేలా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఆమె సూచించారు. ఈ సమస్యపై త్వరలోనే పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

Advertisement

Read Also: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఐదు రోజుల పాటు పిడుగుల వాన, జాగ్రత్త!

Related News

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Big Stories

Advertisement
×