Vegetable Khichdi: రోజూ అదే పప్పుచారు.. అదే టమోటా కూర తిని బోర్ కొడుతోందా? తక్కువ సమయంలో.. ఎక్కువ పోషకాలు అందేలా ఏదైనా టేస్టీ వంటకం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ పద్ధతిలో వెజ్ కిచిడీ ఓసారి ట్రై చేసి చూడండి. ముఖ్యంగా ఆఫీసుకి వెళ్లేవారికైనా, చిన్న పిల్లలకైనా ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. దీనిలో వాడే పెసరపప్పు, రకరకాల కూరగాయలు మనకు కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లను అందిస్తాయి. అలాగే కిచిడీలో వేసే వాము, మిరియాల పొడి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మరి వెజిటేబుల్ కిచిడీ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందామా.
Also Read: ఆదివారం స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ టేస్ట్‌ను తలదన్నే సీక్రెట్ రెసిపీ ఇదే!
పెసరపప్పు – అరకప్పు
బీన్స్ – నాలుగు (చిన్నగా కట్ చేసుకోవాలి)
క్యారెట్ – ఒకటి
బంగాళదుంప – ఒకటి
క్యాబేజి తురుము – రెండు స్పూన్లు
వంకాయ – ఒకటి
శనగలు – రెండు స్పూన్లు
బియ్యం – రెండు కప్పులు
కొత్తిమీర, ఉప్పు – టీస్పూన్
నెయ్యి – మూడు స్పూన్లు
కరివేపాకు – రెండు రెబ్బలు
జీలకర్ర – ఒకటీస్పూన్
వాము – ఒటీస్పూన్
పసుపు – చిటికెడు
మిరియాల పొడి – అరటీస్పూన్
అల్లం ముక్కలు – అరటీస్పూన్
ముందుగా ప్రెషర్ కుక్కర్లో బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యాబేజీ తురుము, వంకాయ ముక్కలు, నానబెట్టిన శనగలు, పెసరపప్పు, బియ్యం, కొత్తిమీర, నీళ్లు, ఉప్పు వేసి మూతపెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
తర్వాత ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, మిరియాలు, వాము, కరివేపాకు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేయించిన తర్వాత అందులో కిచిడి మిశ్రమం వేసి స్ట్ ఆఫ్ చేసేయాలి. అంతే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కిచిడీ రెడీ..
Also Read: పదే నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ.. నోరూరించే టొమాటో పులిహోర ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!