E-Paper
Advertisement

Crispy Potato Bites: అదిరిపోయే స్నాక్ క్రిస్పీ పొటాటో బైట్స్.. ఇంట్లోనే సింపుల్‌‌గా రెడీ చేసుకోండిలా !

Crispy Potato Bites: అదిరిపోయే స్నాక్ క్రిస్పీ పొటాటో బైట్స్.. ఇంట్లోనే సింపుల్‌‌గా రెడీ చేసుకోండిలా !
Advertisement

Crispy Potato Bites: సాయంత్రం వేళ టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ ఉంటే ఆ మజాయే వేరు. ముఖ్యంగా బంగాళదుంపలతో చేసే వంటకాలకు అందరూ ఫిదా అయిపోతారు. బయట దొరికే ఫ్రోజన్ స్నాక్స్ కంటే ఇంట్లోనే తాజాగా.. తక్కువ సమయంలో తయారు చేసుకునే క్రిస్పీ పొటాటో బైట్స్ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అంతే కాకుండా వీటిని తక్కువ పదార్థాలతోనే అద్భుతమైన రుచిని పొందవచ్చు. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో బైట్స్ పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పంపవచ్చు. ఈ రుచికరమైన స్నాక్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:
బంగాళదుంపలు: 3 (ఉడికించినవి)

Advertisement

పిండి: బియ్యం పిండి (3 టేబుల్ స్పూన్లు)

కార్న్ ఫ్లోర్ (2 టేబుల్ స్పూన్లు)

Advertisement

చిల్లీ ఫ్లేక్స్ (1 టీస్పూన్)

మిరియాల పొడి (1/2 టీస్పూన్)

ఒరేగానో లేదా చాట్ మసాలా (1/2 టీస్పూన్)

సన్నగా తరిగిన వెల్లుల్లి (1 టేబుల్ స్పూన్)

సన్నగా తరిగిన కొత్తిమీర( సరిపడా)

ఉప్పు (రుచికి సరిపడా)

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటి పొట్టు తీసి, ఒక గిన్నెలోకి తీసుకుని గడ్డలు లేకుండా మెత్తగా మెదపాలి. బంగాళదుంపలు మరీ నీరుగా ఉండకూడదు. కాస్త గట్టిగా ఉంటే బైట్స్ బాగా వస్తాయి.

2. మెదిపిన బంగాళదుంప మిశ్రమంలో సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, తగినంత ఉప్పు ఆ తర్వాత కొత్తిమీర వేయాలి. దీనికి బైండింగ్ కోసం బియ్యం పిండి , కార్న్ ఫ్లోర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి చేతికి అంటుకుంటే కొద్దిగా నూనె రాసుకోవచ్చు.

3. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకోవాలి. వీటిని పొడవుగా రోల్ చేసి, ఒక అంగుళం పరిమాణంలో ముక్కలుగా కట్ చేయాలి. మీకు నచ్చితే వీటిని రౌండ్‌గా లేదా నగెట్స్ ఆకారంలో కూడా చేసుకోవచ్చు. ఒక ఫోర్క్ తీసుకుని వీటి పైన మెల్లిగా నొక్కితే మంచి డిజైన్ వస్తుంది.

Also Read: రోటీ, పరాటాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ట్రెడిషనల్ పంజాబీ బైంగన్ బర్తా రెసిపీ ఇదిగో

4. స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి తయారు చేసుకున్న పొటాటో బైట్స్‌ను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.

5. బైట్స్ అన్నీ బంగారు వర్ణం వచ్చే వరకు , పైన క్రిస్పీగా మారే వరకు వేయించాలి. అన్ని వైపులా సమానంగా వేగడానికి గరిటెతో తిప్పుతూ ఉండాలి. వేగిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. తద్వారా అదనపు నూనె పీల్చుకుంటుంది.

వేడి వేడి క్రిస్పీ పొటాటో బైట్స్ రెడీ. వీటిని టమాటో కెచప్ లేదా మయోనైజ్‌తో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్స్ చేయడం చాలా వేగంగా అయిపోతుంది కాబట్టి బంధువులు వచ్చినప్పుడు కూడా వెంటనే తయారు చేసి పెట్టొచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×