E-Paper
Advertisement

Koti Robbery: మాటు వేసి పక్కా ప్లాన్ తో.. కోఠి కాల్పుల ఘటనలో సీసీటీవీ వీడియో

Koti Robbery: మాటు వేసి పక్కా ప్లాన్ తో.. కోఠి కాల్పుల ఘటనలో సీసీటీవీ వీడియో
Advertisement

Koti Robbery: హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో మనీ డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ అనే వ్యక్తి నుంచి ఇద్దరు దుండగులు రూ.6 లక్షలు కొట్టేశారు. వారిని ప్రతిఘటించిన ఘటనలో అతడిపై కాల్పులు జరిపారు. దీంతో బాధితుడి కాలుకి తూటా గాయమైంది. ఈ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారిన మారింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద స్థానికులు చూస్తుండగానే గన్ తో కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బ్లాక్ కలర్ స్కూటీపై వచ్చి రషీద్ పై కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.

ఇది తెలిసిన వాళ్ల పనేనా?

రషీద్ బ్యాగ్ తో ఏటీఎంలోకి వెళ్లే ముందు నిందితులు రెక్కీ నిర్వహించారు. రషీద్ ఉదయం 7 గంటలకే వస్తాడని దుండగులకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది. నగదు డిపాజిట్ చేసే సమయం, పారిపోయేందుకు రూట్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులు ముందే రెక్కీ నిర్వహించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రషీద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

సీసీ కెమెరాల్లో రికార్డు

చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రషీద్ ఏటీఎంలోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు మరో వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఏటీఎంలోకి వెళ్లి రషీద్ నుంచి బ్యాగ్ లాక్కున్నాడు. రషీద్ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతడిపై కాల్పులు జరిపారు. రషీద్ కాలుకు గాయమైంది. అనంతరం ఇద్దరు నిందితులు స్కూటీపై పరారయ్యారు. ఈ చోరీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అనిపిస్తుంది. నిందితులు సరిగ్గా రషీద్ ఆ సమయంలో అక్కడికి వస్తున్నట్లు నిందితులకు ఎలా తెలిసింది? ఇది తెలిసిన వాళ్ల పనేనా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×