Coconut Sweet Recipe: చాలామంది బరువు తగ్గాలని కఠినమైన డైట్లు పాటిస్తుంటారు. అందులో కొంతమంది సీరియస్‌గా డైట్ ఫాలో అవుతుంటే.. మరికొందరు ఇష్టమైన ఫుడ్స్‌ను వదులుకోలేక అప్పుడప్పుడూ స్వీట్స్, డెజర్ట్స్ లాగించేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ కొబ్బరి లడ్డూలు. చక్కెర, నెయ్యి, నూనె లేకుండానే తయారు చేసుకునే ఈ కొబ్బరి స్వీట్ బరువు తగ్గాలనుకుంటున్న వారికి బెస్ట్ ఆప్షన్. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ హెల్తీ డెజర్ట్‌ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
Also Read: కమ్మని నెయ్యి సువాసనతో పుదీనా రైస్.. లంచ్ బాక్సులోకి బెస్ట్ ఆప్షన్!
తాజా కొబ్బరి తురుము – రెండు కప్పులు
మెత్తని బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు
వేయించిన వేరుశెనగలు – అరకప్పు
యాలకులు (దంచినవి) – నాలుగు
ఉప్పు – చిటికెడు
పచ్చి కొబ్బరిని తురుముకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక మందపాటి బాణలిని స్టౌ మీద పెట్టి, అందులో బెల్లం తురుము వేసి కొద్దిగా నీరు పోసి కరిగించండి. బెల్లం కరిగి పాకం కాస్త దగ్గర పడుతున్నప్పుడు, రెడీగా ఉంచుకున్న కొబ్బరి తురుమును అందులో వేసి బాగా కలపండి. కొబ్బరిలో ఉండే సహజమైన జిగురు, బెల్లం పాకంతో కలిసి చిక్కబడటం మొదలవుతుంది.
మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు పల్లీల, యాలకుల పొడి వేసి కలపండి. ఎక్కడా నూనె కానీ, నెయ్యి కానీ వాడకుండానే కొబ్బరిలోని సహజమైన నూనె పదార్థాల వల్ల ఈ మిశ్రమం బాణలికి అంటుకోకుండా వస్తుంది. మిశ్రమం అంతా ముద్దలా తయారైన తర్వాత, ఒక ప్లేట్‌కు కొద్దిగా నీరు రాసి దానిపై ఈ మిశ్రమాన్ని వేసి సమంగా పరచండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకుంటే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి స్వీట్ రెడీ.
Also Read: ఇంట్లో కూరగాయలు లేవా? అయితే ఈ స్పైసీ టమాటో పులావ్ చేసుకోండి, టేస్ట్ మామూలుగా ఉండదు!