E-Paper
Advertisement

Tomato Pulihora: పదే నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ.. నోరూరించే టొమాటో పులిహోర ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Tomato Pulihora: పదే నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ.. నోరూరించే టొమాటో పులిహోర ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
Advertisement

Tomato Pulihora: రోజు చేసుకునే రొటీన్ అన్నం కంటే ఏదైనా వెరైటీగా.. నోటికి రుచిగా తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది పులిహోర. అయితే, ఎప్పుడూ చేసే చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర కాకుండా, కొంచెం కొత్తగా టొమాటోలతో కలిపి చేసే ఈ టొమాటో పులిహోరను ట్రై చేయండి. పుల్లపుల్లగా, కారంగా ఉంటూ తక్కువ టైంలోనే తయారయ్యే ఈ రెసిపీ లంచ్ బాక్స్‌లకైనా బాగుంటుంది. మరి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో టొమాటో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా.

Also Read: క్యాబేజీ తినని వాళ్లు కూడా ఫిదా అవ్వాల్సిందే.. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి!

కావాల్సిన పదార్థాలు:

Advertisement

బియ్యం – పావుకిలో
టొమాటోలు – పావుకిలో
చింతపండు గుజ్జు – టేబుల్ స్పూన్
పర్చిమిర్చి – ఆరు
ఇంగువ – చిటికెడు
వేరుసెనగ పప్పు – 3 టేబుల్ స్పూన్లు
సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
ఎండుమిర్చి – నాలుగు
ఆవాలు – టీస్పూన్
నూనె – 100 మి.లీ.
కరివేపాకు – నాలుగు రెబ్బలు
పసుపు – టీస్పూన్

 టొమాటో పులిహోర తయారీ విధానం:

ముందుగా టొమాటోలు, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకుని, అవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక, అందులో చింతపండు గుజ్జును కూడా చేర్చి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్నాన్ని పొడిపొడిగా వండుకుని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి.

Advertisement

ఇప్పుడు సిద్ధం చేసుకున్న టొమాటో మిశ్రమాన్ని అన్నంలో వేసి ముక్కలు అవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి వేరుసెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసి చిటపటలాడాక, ఈ మిశ్రమాన్ని టొమాటో అన్నంలో వేసి బాగా కలుపుకుంటే టొమాటో పులిహోర సిద్ధం.

Also Read: బయట పానీపూరీ తినాలంటే భయమా? అయితే ఇంట్లోనే ఇలా చిటికెలో పానీ రెడీ చేసుకోండి!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×