E-Paper
Advertisement

Chinta Chiguru Pachi Royyalu: నోరూరించే చింతచిగురు పచ్చి రొయ్యల ఇగురు.. ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు!

Chinta Chiguru Pachi Royyalu: నోరూరించే చింతచిగురు పచ్చి రొయ్యల ఇగురు.. ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు!
Advertisement

Chinta Chiguru Pachi Royyalu: పచ్చి రొయ్యల కూర అంటేనే నాన్ వెజ్ ప్రియులకు అదో రకమైన ఇష్టం. అయితే, అదే రొయ్యలకు కొంచెం పుల్లపుల్లని చింతచిగురు తోడైతే.. ఆ రుచే వేరు కదా! ముఖ్యంగా గోదావరి సైడ్ పల్లెటూళ్లలో చింతచిగురు ఘుమఘుమలు మామూలుగా ఉండవు. రొయ్యల తీపి, చింతచిగురు పులుపు కలిసి అన్నంలో కలుపుకుని తింటుంటే అసలు ప్లేటు ఖాళీ అయ్యే వరకు వదిలిపెట్టరు. మసాలాలు ఎక్కువగా లేకుండా, ఇంట్లో ఉండే తక్కువ వస్తువులతో ఎంతో టేస్టీగా, నోరూరించేలా ఈ కూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Also Read: పిల్లలు కూడా లొట్టలేసుకుని తినేలా.. స్పెషల్ వెజిటేబుల్ కిచిడీ రెడీ!

కావాల్సిన పదార్థాలు:

Advertisement

పచ్చి రొయ్యలు – అరకిలో
చింతచిగురు – ఒక కప్పు
ఉల్లిపాయలు – రెండు (పెద్దవి)
పచ్చిమిర్చి – ఐదు
పసుపు – అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

తయారీ విధానం:

ముందుగా పచ్చిరొయ్యలను శుభ్రం చేసి అందులో కాస్త ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతచిగురును శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారేవరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిరొయ్యలను వేసి కలపాలి.

Advertisement

రొయ్యలు కాస్త మగ్గిన తర్వాత చింతచిగురుని కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి. అలా మూత పెట్టి పావుగంట సేపు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇగురులాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ చింతచిగురు, పచ్చిరొయ్యలు రెసీపీ రెడీ అయిపోయింది.

Also Read: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా.. ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, టేస్టీగా రావడం ఖాయం!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×