E-Paper
Advertisement

Multigrain Masala Dosa: మల్టీగ్రెయిన్ మసాలా దోస.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Multigrain Masala Dosa: మల్టీగ్రెయిన్ మసాలా దోస.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Multigrain Masala Dosa: సాధారణంగా మనం తినే బియ్యం దోసల కంటే.. మల్టీగ్రెయిన్ దోశలు ఎంతో బలవర్థకమైనవి. బియ్యంతో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, వివిధ రకాల పప్పులను కలిపి చేయడం వల్ల ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్ పుష్కలంగా అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి.. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్. హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా ఉండే మల్టీగ్రెయిన్ మసాలా దోసను స్టెప్-బై-స్టెప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మల్టీగ్రెయిన్ మసాలా దోస తయారీ విధానం :
కావాల్సిన పదార్థాలు:

ధాన్యాలు: రాగులు (1/2 కప్పు), జొన్నలు (1/2 కప్పు), సజ్జలు (1/2 కప్పు), బ్రౌన్ రైస్ లేదా మామూలు బియ్యం (1 కప్పు).

పప్పులు: మినప్పప్పు (1/2 కప్పు), పచ్చి శనగపప్పు (2 చెంచాలు), మెంతులు (1 చెంచా).

మసాలా ఫిల్లింగ్ కోసం: ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు.
నూనె లేదా నెయ్యి, తగినంత ఉప్పు.

తయారీ విధానం:

1. ముందుగా పైన చెప్పిన ధాన్యాలన్నింటినీ, పప్పులను విడివిడిగా లేదా కలిపి శుభ్రంగా కడిగి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. మెంతులను మినప్పప్పుతో కలిపి నానబెట్టడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. నానిన తర్వాత గ్రైండర్ లేదా మిక్సీలో వేసి మెత్తగా దోశ పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు కలిపి 8 గంటల పాటు పులియబెట్టాలి . దీని వల్ల దోశలకు మంచి రుచి, పోషకాలు అందుతాయి.

2. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంపలను వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే మసాలా రెడీ.

3. స్టవ్ మీద దోస పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నీళ్లు చిలకరించి తుడిచేయాలి. ఇప్పుడు ఒక గరిటెడు మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుని పెనంపై పల్చగా రౌండ్‌గా రుద్దాలి. దోస చుట్టూ ఒక చెంచా నూనె లేదా నెయ్యి వేయాలి.

4. దోసఎర్రగా కాలాక, మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలాను పెట్టాలి. దోశను రోల్ చేసి లేదా సగానికి మడిచి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

Also Read: నార్త్ ఇండియన్ స్టైల్ మొఘలాయి చికెన్ కుర్మా.. ఇలా వండితే అందరూ మెచ్చుకోవాల్సిందే

చిట్కాలు:
దోశలు మరింత క్రిస్పీగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా అటుకులు కలిపి నానబెట్టండి.

పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు.

నాన్-స్టిక్ పెనం కంటే.. ఇనుప పెనం వాడితే దోశలు హోటల్ స్టైల్‌లో వస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ మల్టీగ్రెయిన్ దోశలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

Related News

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

Big Stories

×