No Cook Food Ideas: ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో LPG గ్యాస్ కొరత కారణంగా చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వంట చేయడానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల రోజు వారీ ఆహారపు అలవాట్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వంట అవసరం లేకుండా.. తయారుచేసుకునే ఆహారాలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇవి కేవలం సులభమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి.ఇప్పుడు గ్యాస్ లేకుండా తయారు చేసుకోగలిగే నో-కుక్ ఫుడ్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం.
గ్యాస్ కొరతలో నో-కుక్ ఆహారాల ప్రాముఖ్యత:
గ్యాస్ లేకపోయినా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అందుకే వంట అవసరం లేకుండా సులభంగా తయారుచేసుకునే ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. ఇవి సమయం, శక్తి రెండింటినీ ఆదా చేస్తాయి.
స్ప్రౌట్స్-పోషకాహారానికి బెస్ట్ :
సెనగలు, పెసలు, సోయాబీన్స్ వంటి ధాన్యాలను రాత్రంతా నానబెట్టి మొలకలు వేయించుకుంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధమవుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కీరా, టమాటో, ఉల్లిపాయ, నిమ్మరసం, చాట్ మసాలా కలిపితే రుచిగా ఉంటుంది.
దహి చూరా-సింపుల్ & ఫిల్లింగ్ మీల్:
అటుకులు (చూరా)ను పెరుగు తో కలిపి తింటే ఇది తేలికగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా ఇది త్వరగా తయారయ్యే ఆహారం. సమ్మర్ లో కూడా ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్.
సట్టు-శక్తినిచ్చే డ్రింక్:
సట్టు పిండిని.. నీరు లేదా పాలలో కలిపి తాగొచ్చు. దీనిలో తీపి కోసం బెల్లం లేదా చక్కెర కలపుకోవచ్చు. ఉప్పుగా తాగాలంటే నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు కలిపితే రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.
Also Read: సమ్మర్‌లోనూ రుచికరంగా బ్రేక్ ఫాస్ట్.. ఈ లిస్ట్‌పై ఓ లుక్కేయండి !
సాండ్విచ్‌లు-వెంటనే తయారయ్యే ఆహారం:
బ్రెడ్ తీసుకుని వెన్న, మయోనైజ్ లేదా చట్నీ వేసి కీరా, టమాటో, ఉల్లిపాయలు పెట్టి సాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఆహారం ఇది.
అన్నం & చట్నీ-సింపుల్ మీల్:
ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే దానితో చట్నీ కలిపి తినవచ్చు. కొత్తగా కూరలు చేయకుండా.. తక్కువ గ్యాస్‌తో ఈ విధంగా భోజనం పూర్తి చేయొచ్చు.పెరుగు అన్నం కూడా దీనికి బెస్ట్.
గ్యాస్ కొరత ఉన్న సమయంలో కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నో-కుక్ ఫుడ్ ఐడియాస్ ద్వారా మీరు సింపుల్ గా తక్కువ సమయంలో ఆహారం తయారు చేసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందించడమే కాకుండా.. గ్యాస్ వాడకాన్ని కూడా తగ్గిస్తాయి.