E-Paper
Advertisement

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!
Advertisement

KTR Allegations: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కాంగ్రెస్ వాళ్లే పేల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్ల పాలనలో 2 పిల్లర్లను సైతం రిపేర్ చేయలని అసమర్థ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు. అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకోవాలన్నది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చేళ్లు మూడేళ్లు దాటినా ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేయలేదంటే ఇంకేమనాలంటూ ప్రశ్నించారు.

భూపాలపల్లికి చెందిన నేతలు పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శించారు. ‘ఇది ప్రజా పాలన కాదని, అవినీతి పాలన అని కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుండటం వారి పాలనలో పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకే అర్జీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్సంటేజీ ఇవ్వనిదే పనులు జరగడం లేదని చెబుతుంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ సీఎంపై రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాల ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులే ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

Advertisement

డబ్బులు పంచితే ప్రజలు తనకే ఓటు వేస్తారనే భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అటు పెన్షన్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు.

Also Read: రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా ఢిల్లీ పార్టీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి వెనుక పరుగులు తీశారని విమర్శించారు. బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందని, అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రామచంద్రరావు ఆయన కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం ఆత్మగౌరవ పోరాటమని.. అలాంటి తెలంగాణలో మళ్లీ ఢిల్లీ పార్టీలకు గులాములుగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.

Also Read: ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు.. పోలీసులే షాక్!

Tags

Related News

సిద్దిపేట జిల్లాలో.. రూ. 544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం!

డేంజర్ బెల్స్.. హైదరాబాద్‌లో చికెన్ తింటున్నారా..?

బిగ్ బ్రేకింగ్.. ఇంటర్ మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం, హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మంటలు, పరుగులు పెట్టిన ప్రజలు

కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి ఇష్యూ.. టీపీసీసీ మహేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు, వేటు తప్పదా?

Big Stories

Advertisement
×