Siddipet Development: సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. దీంతో పాటుగా రూ.13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపను చేసారు. చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
సిద్ధిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్ ప్రారంభోత్సవం చేశారు. రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం చేశారు. రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం ప్రారంభోత్సవంతో పాటు గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు.
Also read: ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీ పై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!