Gundeninda GudiGantalu Today episode july 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. శోభన అనుకున్నట్లుగానే తన కూతురు ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేయాలని భారీగా ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద కోడలైన రోహిణికి వాళ్ళ నాన్న రాకపోవడంతో ముందుగా శృతి ఫంక్షన్ ని చేయాలని అనుకుంటారు. తాళి మార్చే ఫంక్షన్ ముందు శృతికి చేస్తారు. శృతి తాళి మార్చిన తర్వాత కామాక్షి అత్తమామలు అమ్మానాన్నల కు నమస్కారం చేయాలి అమ్మ అనేసి అనగానే శృతి అక్కడే కూర్చొని నమస్కారం చేస్తుంది. అది చూసినా అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు. కాదమ్మా లేచి కాళ్లకు దండం పెట్టుకోవాలి అని కామాక్షి చెప్తుంది. శృతి రవి ఇద్దరు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సత్యం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని దీవిస్తాడు.. ప్రభావతి మాత్రం ఒంటినిండా బంగారంతో ఇలాంటివి మరిన్ని కొనాలని దీవిస్తుంది. సత్యంని చూసి మళ్లీ మాట మార్చి పిల్లాపాపలతో బంగారు భవిష్యత్తును గడపాలని కోరుకుంటున్నా అని అంటుంది.. బాలుని ఇరికించి రోహిణి తప్పించుకుందామని అనుకుంది కానీ రోహిణి అనుకున్న ప్లాను రివర్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…రోహిణి సెట్ చేసిన అతనితో బాలు పూర్తిగా తాగించేస్తాడు. నువ్వేంటి ఇంకా తాగట్లేదు అని అడుగుతాడు. నేను నా భార్యకి ఇచ్చిన మాట కోసమే తాగట్లేదు నువ్వు కాని చెయ్ నువ్వు హ్యాపీ కదా అని అతను అంటాడు. ఆ మాట విన్న మీనా బాలు దగ్గరకొచ్చి హగ్ చేసుకుంటుంది. నా మాట కోసం మీరు తాగలేదు చూడు అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బాలుతో అంటుంది. బాలు మీనా లోపలికి రావడంతో సత్యం ఎక్కడికి వెళ్లారు రా ఇప్పటివరకు ఎక్కడున్నాడు అమ్మ వీడు ఏం చేశాడు అని అడుగుతాడు.
ఇక్కడే ఫంక్షన్ లో ఉన్నాడు మామయ్య ఎక్కడికి వెళ్ళలేదు అని మీనా అంటుంది. ఇదంతా కాదు గాని ఆయన వచ్చారా ఆయన కోసమే అంత వెయిట్ చేస్తున్నారు కదా అని బాలు అడుగుతాడు.. ఆయనే ఎవరు అని సత్యం అడుగుతాడు. అదే మలేషియా నుంచి ఆ రోహిణి వాళ్ళ నాన్న వస్తారని ఈ ప్రభావతి డబ్బులు కొట్టుకుంటారు కదా వచ్చాడా మరి అని అంటాడు.. ఆయన కోసమే ఇప్పటివరకు వెయిట్ చేసాము ఇంకా రాలేదని అమ్మాయి కూడా తాళి మార్చే ఫంక్షన్ చేసేసాము అని సత్యం అంటాడు.
ఆయన రాడు నాన్న మొదటి నుంచి ఆమె తీరు అలా ఉంది ఒక ఫ్రాడ్ నాన్న అని బాలు అంటాడు. అదంతా ఈ ఫంక్షన్ లో ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం లే..రోహిణి కి మీ అమ్మకి అన్ని విషయాలు తెలుసు అని సత్యం అంటాడు.. ఇక రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి నా పరువు తీయాలని ఫిక్స్ అయ్యావా నువ్వు? మీ నాన్న ఎక్కడ అని గట్టిగా అరుస్తుంది. రోహిణి అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య మా నాన్న ఇంకా రాకపోవడానికి నాకు ఏంటి సంబంధం అని మాట్లాడుతుంది.
నీ పెళ్లికి రాలేదు.. కనీసం ఇప్పుడు అన్న వస్తాడని అందరికీ చెప్పాను. నా పరువు ని అడ్డంగా తీసేసావు కదా.. కనీసం నీ షష్టిపూర్తికైనా వస్తాడా అని ప్రభావతి రోహిణి పై సీరియస్ అవుతుంది.. కానీ సత్యం వాళ్ళ నాన్న రాలేదని అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా అంటున్నావు అని ప్రభావతిపై అరుస్తాడు.. రోహిణి మాత్రం నాకేం తెలుసు అత్తయ్య నన్ను అడుగుతున్నారు అని అమాయకంగా నటిస్తుంది. కామాక్షి మీరు ఇలా గొడవ పడితే ఆ శృతి వాళ్ళ అమ్మానాన్నలు చూసి నవ్వుతారు అని అంటుంది.
బాలు సత్యం ను ఎలాగైనా అవమానించాలి భోజనం దగ్గర కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు తినాల్సిన దగ్గర మీరు తింటున్నారా? అని అవమానిస్తే వాడి కోపం వస్తుంది కచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని అనుకుంటారు శోభన సురేంద్ర.. వాళ్ళని కావాలని భోజనానికి పిలుస్తారు. శోభన వాళ్ళ మనుషులు దగ్గరుండి వాళ్ళని భోజనానికి కూర్చోబెడతారు. ఎలాగైనా సరే ఇక్కడ వీళ్ళని దారుణంగా అవమానిస్తే ఆ బాలు గాడికి కోపం వస్తుంది. కచ్చితంగా గొడవకు దిగుతాడు నాలుగు పీకుతాడు అని సురేంద్ర అనుకుంటాడు.
Also Read:‘తమ్ముడు ‘ ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?
అయితే బాలు మాత్రం వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో జరగబోతుంది అని సత్యంతో అంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు భోజనానికి కోసం వెయిట్ చేస్తుంటే వారిని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. చూసిన శోభన, షాక్ అవుతారు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..