Hushaaru pittalu:ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడల్ట్ కామెడీ జోనర్ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ లభిస్తోంది. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక మంచి మెసేజ్ ఇద్దామని చేసిన నిజాయితీగల ప్రయత్నమే తాజా చిత్రం హుషారు పిట్టలు. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద బ్యానర్ అండతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో
అన్ష్ (Ansh), వాసవి గణేషన్ (Vasavi Ganeshan) జంటగా నటించారు. ఈ చిత్రానికి భిక్షు దర్శకత్వం వహించారు. వెంకటేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో ఇప్పుడు చూద్దాం..
రవి ( అన్ష్ థోరట్) చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండే ఒక ఇన్నోసెంట్ కుర్రాడు.. ఎలాగైనా లైఫ్లో ఒక మంచి స్థాయికి వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి రవి జీవితంలోకి బాలు (చరణ్) అనే కుర్రాడు ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి రవి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పుల వల్ల చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి లైఫ్ ఎలా ముడిపడింది? వీరి జీవితాలను వారి తల్లిదండ్రులు సత్తయ్య, సునీత అలాగే చిట్టి తండ్రి పండు ఎలా ప్రభావితం చేశారు? నేటి యువత తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎటువైపు దారి తీస్తున్నాయి? అనేదే ఈ హుషారు పిట్టలు సినిమా కథ
కొత్త వారైనా సరే లీడ్ జంట చాలా న్యాచురల్ గా నటించారు. ఇన్నోసెంట్ కుర్రాడిగా అన్ష్ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో మంచి పరిణతి చూపించాడు. హీరోయిన్ వాసవి గణేషన్ తన క్యూట్ లుక్స్ తో , చలాకీతనంతో యువతకు బాగా కనెక్ట్ అయింది. గోవర్ధన్ రెడ్డి, రమేష్, ప్రాణి రెడ్డి లాంటి సీనియర్ నటులు కూడా తమ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు.
అన్షు , వాసవి ఫ్రెష్ యాక్టింగ్ ఎనర్జీ బాగా ఆకట్టుకుంది.
ఫస్ట్ హాఫ్ లో యువతను ఆకట్టుకునే ఫాస్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఎలిమెంట్స్ బాగున్నాయి.
చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ టైటిల్ సాంగ్ తో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది
రూరల్ బ్యాక్ డ్రాప్ ను న్యాచురల్ గా చూపించిన కెమెరా వర్క్
క్లైమాక్స్ లో నేటి యువతకు తల్లిదండ్రులకు ఆలోచింపజేసేలా ఇచ్చిన మంచి మెసేజ్
సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథనం కాస్త స్లో అవ్వడం
కొన్ని సన్నివేశాలు పదేపదే రిపీట్ అవుతున్నట్లు అనిపించడం
యూత్ ను ఆకర్షించేందుకు పెట్టిన కొన్ని బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ కి ఇంకా బలంగా కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది.
also read: తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!
డైరెక్టర్ భిక్షుయాదవ్ ఎంచుకున్న పాయింట్ చాలా మంచిది. యువతకు కనెక్ట్ అయ్యేలా ఫస్ట్ ఆఫ్ అంత చాలా హుషారుగా సరదాగా తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ లో కథనం కాస్త నెమ్మదించినా.. పక్కదారి పడుతున్న యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలన్న దర్శకుడు ఆలోచనను కచ్చితంగా అభినందించాలి. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కొత్త నటీనటులు మరియు చిత్ర బృందం చేసిన ఈ నిజాయితీ గల ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. యువతతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని ఒకసారి కచ్చితంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హుషారు పిట్టలు మంచి మెసేజ్ తో ఎగిరిన యువతరం కథ.