E-Paper
Advertisement

తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ

తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ
Advertisement

Raising Kanan Season 5 on OTT : ఒక తల్లి నీడలో పెరిగిన కుర్రాడు… చివరకు అదే తల్లికి ఎదురుగా నిలబడే క్రిమినల్‌గా మారితే ? సొంత కుటుంబమే శత్రువుగా మారితే ? ప్రాణంగా ప్రేమించిన వాళ్లనే ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లాల్సి వస్తే ? ‘పవర్ బుక్ III: రైజింగ్ కానన్’ (Power Book III – Raising Kanan Season 5) చివరి సీజన్‌లో కానన్ స్టార్క్ ప్రయాణం ఇలాంటి భయంకరమైన మలుపులు తిరుగుతుంది. సాధారణ కుర్రాడిగా మొదలైన అతని జీవితం… చివరకు ‘పవర్’ యూనివర్స్‌లో అత్యంత క్రూరమైన డ్రగ్ కింగ్‌పిన్‌గా మారే దశకు చేరుకుంటుంది. మరి ఆ తరువాత ఏం జరిగింది ? ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే… 

సీజన్ ప్రారంభంలో కానన్ స్టార్క్ తన తల్లి రాక్ నీడ నుంచి పూర్తిగా బయట పడాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పటి వరకు కుటుంబం, ముఖ్యంగా రాక్ పై డీపెండ్ అవుతూ సాగిన తన క్రిమినల్ జీవితాన్ని ఇకపై సొంతంగా నిర్మించుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో సౌత్‌సైడ్ క్వీన్స్ డ్రగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న బ్రీజ్‌తో చేతులు కలుపుతాడు. బ్రీజ్‌తో కలిసి కానన్ క్వీన్స్ డ్రగ్ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న కొద్దీ కానన్ మరింత ధైర్యంగా, మరింత క్రూరంగా మారుతుంటాడు. కానీ అతని ఎదుగుదల బయట ఉన్న శత్రువులకు మాత్రమే సమస్య కాదు. అతని సొంత కుటుంబానికే పెద్ద ప్రమాదంగా మారుతుంది.

Advertisement

ఒకవైపు రాక్ తన డ్రగ్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తుంటుంది. మరోవైపు మార్విన్ కూడా కుటుంబాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కానన్ మాత్రం ఇక తన ఫ్యామిలీ కంట్రోల్ లో ఉండే స్థితిలో ఉండడు. తన దారిలో ఎవరు అడ్డొచ్చినా… వాళ్లతో పోరాడేందుకు సిద్ధమవుతాడు. ఈ కుటుంబ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కానన్, బ్రీజ్ కలిసి జోక్విన్‌ను హతమార్చుతారు. ఈ హత్య తర్వాత పరిస్థితులు మరింత విషమిస్తాయి. కానన్ ఎంత దూరం వెళ్లిపోయాడో రాక్‌కు కూడా అర్థమవుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ? లేక తన కొడుకును ఆపాలా ? అనే పరిస్థితిలో ఆమె చిక్కుకుంటుంది.

ఇంతలో రాక్ తన కుటుంబంలోనే దాచిపెట్టిన మరో భయంకరమైన నిజాన్ని బయట పెడుతుంది. లౌ-లౌను చంపింది బయటి శత్రువు కాదని… సొంత కొడుకు కాననే ఆ హత్యకు కారణమని మార్విన్‌కు చెబుతుంది. ఈ విషయం తెలిసిన మార్విన్ కోపంతో ఊగిపోతాడు. కానన్‌పై విరుచుకుపడి అతన్ని తీవ్రంగా కొడతాడు. ఇప్పటికే కుటుంబ బంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. కొడుకు తల్లికి శత్రువు… బాబాయ్‌కు శత్రువు… కుటుంబం మొత్తం ఒక్కొక్కరుగా కానన్‌కు దూరమవుతుంది. కానీ కానన్ వెనక్కి తగ్గడు. తన ఎదుగుదల కోసం సొంత రక్తాన్ని కూడా లెక్కచేయని స్థాయికి అతని క్రూరత్వం చేరుతుంది.

Advertisement

కథ చివరి దశకు చేరుకునే సరికి కానన్, మార్విన్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమవుతుంది. చివరకు కానన్ తన సొంత బాబాయ్ మార్విన్‌పై దాడి చేస్తాడు. ఈ ఘటనతో థామస్ కుటుంబం మరింత విషాదంలోకి జారిపోతుంది. మార్విన్ మరణం అతని కూతురు జూక్‌బాక్స్‌ను తీవ్రంగా కుదిపేస్తుంది. రాక్ కూడా తన కుటుంబాన్ని కోల్పోతున్న బాధలో మునిగిపోతుంది. కానీ ఇక్కడితో ప్రతీకారం ముగిసిపోదు. తన తండ్రి మరణానికి కాననే కారణమని జూక్‌బాక్స్ తెలుసుకుంటుంది. అతన్ని చంపేసి సమస్యను ముగించే అవకాశం ఉన్నప్పటికీ… ఆమె మరో నిర్ణయం తీసుకుంటుంది. కానన్ కూడా తాను అనుభవిస్తున్న ఒంటరితనం, నష్టాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. అతని దగ్గర ఉన్న ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా దూరం చేయాలని నిర్ణయించుకుంటుంది.

అదే సమయంలో కానన్ వ్యక్తిగత జీవితంలో కూడా మరో షాక్ ఎదురవుతుంది. అతని మాజీ ప్రియురాలు జరిటా తాను గర్భవతి అని చెప్పడంతో అతని ముందు మరో కొత్త బాధ్యత నిలుస్తుంది. ఒకవైపు కుటుంబం పూర్తిగా కుప్పకూలిపోవడం.. మరోవైపు తన గత సంబంధం నుంచి పుట్టబోయే కొత్త జీవితం.. కానన్ జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. చివరకు రాక్ నిర్మించిన థామస్ కుటుంబ సామ్రాజ్యం దాదాపుగా పూర్తిగా కూలిపోతుంది. కుటుంబ బంధాలు తెగిపోతాయి. నమ్మిన వాళ్లు దూరమవుతారు. ప్రేమించిన వాళ్లను కోల్పోతాడు. కానీ ఈ నష్టాలన్నీ కానన్‌ను ఆపలేవు. బదులుగా అతన్ని మరింత ప్రమాదకరమైన వ్యక్తిగా తయారు చేస్తాయి.

ఇక్కడే ‘రైజింగ్ కానన్’ కథ, మనకు ఇప్పటికే తెలిసిన ‘పవర్’ ప్రపంచంలోని కానన్ స్టార్క్‌తో కలుస్తుంది. ఒకప్పుడు తల్లి మాట వింటూ, తన భవిష్యత్తు ఏంటో కూడా తెలియని కుర్రాడు.. ఇప్పుడు తనకంటూ ఓ క్రిమినల్ సామ్రాజ్యం నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తాడు. అసలు కానన్ ఇంత క్రూరంగా ఎలా మారాడు? తన తల్లి రాక్‌తో అతని సంబంధం ఎక్కడికి చేరింది? తన కుటుంబాన్ని ఒక్కొక్కరిని కోల్పోయిన తర్వాత అతను ఎలా ఒంటరి డ్రగ్ కింగ్‌పిన్‌గా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చివరి సీజన్.

తెలుగులో ఉందా ?

‘రైజింగ్ కానన్ సీజన్ 5’తో ఈ ప్రిక్వెల్ కథ ముగిసిపోయినా… ఇది ‘పవర్’ యూనివర్స్‌కు కీలకమైన లింక్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా కానన్ పాత్రను మనం ఒరిజినల్ ‘పవర్’ సిరీస్‌లో చూసిన క్రూరమైన వ్యక్తిగా ఎలా మార్చిందో చూపించడమే ఈ సీజన్‌కు ప్రధాన బలం. ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో లేదు.

Read Also: పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×