E-Paper
Advertisement

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!
Advertisement

Thaman:సమాజం మన కోసం చాలా ఇస్తోంది. తిరిగి సమాజం కోసం మనం ఏదో కొంత ఇవ్వాలి. లేకపోతే లావైపోతాం అనే డైలాగు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను మొదలుకొని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) వరకు ఎంతోమంది తమ సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది వృద్ధాశ్రమం నిర్మించాలన్నది తన కళ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దానిని ప్రారంభించామని, అందుకోసం ఏకంగా 12 కోట్లు ఖర్చు అవుతోంది అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వృద్ధాశ్రమం కోసం 12 కోట్లు ఖర్చు – తమన్

ప్రస్తుతం వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ.. ఆయా సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న తమన్.. అంతే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం.. అలాగే దాని ఖర్చుపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో భాగంగా తమన్ మాట్లాడుతూ.. వృద్ధాశ్రమం నిర్మించాలనే నా కోరిక కోసం నేను గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం సుమారుగా 12 కోట్లు ఖర్చవుతోంది. ముఖ్యంగా ఇప్పటికే 4 కోట్ల వరకు ఖర్చు చేసాము. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమకూర్చే పనిలో ఉన్నాను

Advertisement

also read:ఓటీటీలోకి రాబోతున్న ఉన్మాదం..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నా సంపద మొత్తం దానికోసమే..

ముఖ్యంగా నాకు సేవా కార్యక్రమాలు చేయాలి అంటే చాలా ఇష్టం. నా తరఫున సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక బృందం కూడా ఉంది. నా వృత్తిలో విజయం సాధించిన తర్వాత ఆ సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమానికి డబ్బు ఇస్తామని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ నాకు అక్కర్లేదు. నా సొంత సంపాదనతోనే నిధులు సమకూరుస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రయోజనం కోసమే నా పారితోషకంలో చాలా భాగాన్ని పొదుపు చేస్తున్నాను . సంగీత కచేరీలలో పాల్గొంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను అంటూ తమన్ తెలిపారు.

తమన్ సినిమాలు..

Advertisement

సరైన సౌకర్యాలు , కుటుంబ మద్దతు లేని వృద్ధులకు వృద్ధాశ్రమాన్ని నిర్మించడం ద్వారా సహాయం, సంరక్షణ అందించవచ్చు . సెలబ్రిటీలు కూడా తమ విజయాన్ని సమాజానికి సహాయపడడానికి ఉపయోగించవచ్చు అని తమన్ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే వృద్ధాశ్రమం కోసం ఏకంగా రూ.12 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇటీవల లెనిన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తమన్ ఇటీవల కొరియన్ కనకరాజుతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం NBK 111 మూవీ తో పాటు OG 2, మెగా 158 చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఏది ఏమైనా తమన్ మంచి మనసుకి అభిమానులు సినీ సెలబ్రిటీలు ఫిదా అవుతూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!

Big Stories

Advertisement
×