Jabilamma Neeku Antha Kopama Movie Review: యంగ్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. మేనల్లుడు పవిష్ నారాయణ్ (Pavish Narayan)ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.. ఈ మూవీ ఎలా ఉందో ఉందో ఒకసారి రివ్యూ లో చూద్దాం…
కథ..
ఈరోజుల్లో ప్రేమకథా చిత్రాలకు యూత్ బాగా ఆకర్షితులవుతున్నారు. అలాంటి కథతోని ఈ సినిమాకు కూడా వచ్చిందని తెలుస్తుంది. ఈ మూవీలో ఈ సినిమాలో హీరోకు పెళ్లిచూపులు అరేంజ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఆ పెళ్లిచూపులు కొచ్చిన అమ్మాయిని చూసి అతను షాక్ అవుతారు. దానికి అమ్మాయి తన క్లాస్మెట్.. వారం రోజులు ట్రావెల్ చేశాక పెళ్లి మీద నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు.. అప్పటికే ఇంట్లో వాళ్ళు వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేస్తారు. వాళ్లు షాక్ అవుతారు. ఇక తన క్లాస్మేట్స్ కి ఏదో కథలు చెప్పడం మొదలు పెడతారు. అంతకుముందే నీలా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రభుని తన తండ్రి (శరత్ కుమార్)కు పరిచయం చేస్తుంది నీలా. ఆ తర్వాత వాళ్ళ ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఎదురు అయ్యాయి? ఎందుకు దూరం అయ్యారు? నీలా పెళ్లికి ప్రభు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? గోవాలోని డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈవెంట్ ప్లానర్ అంజలి ఏం చేసింది?.. తర్వాత స్టోరీలో ప్రభు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? నిజంగా ప్రభువు పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది సినిమాలో చూడాలి..
విశ్లేషణ..
హీరో ధనుష్ కు డైరెక్టర్ గా ఇది మూడో చిత్రం.. గతేడాది ‘రాయన్’తో విజయం అందుకున్నారు.. ఆ సినిమాకు ఇప్పుడు వచ్చిన ఈ సినిమాకు అసలు సంబంధం లేకుండానే కథ ఉంటుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. దర్శక రచయితగా రెండిటి మధ్య వ్యత్యాసం చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక ఈ మూవీ ఎలా ఉందన్న విషయానికొస్తే.. యూత్ కి ఎలాంటి సినిమాలు తీయాలో ధనుష్ కి బాగా అర్థమైపోయింది అలాంటి టీంలోని ఈ సినిమాను తెరికెక్కించి సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. జాబిలమ్మ నీకు అంత కోపమా’లో దర్శక రచయితగా ప్రేక్షకులకు సెటైర్ వేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఈ జనరేషన్ ప్రేమికుల్లో చాలా మంది ‘బుజ్జి కన్నా’ అంటూ ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటాం..
నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో మొత్తం యూత్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో అందరూ ఎవరికి వారే అన్నట్లు తమ నటనలు విజృంభించారు. టెక్నికల్ పరంగా సినిమాకు మంచి అవుట్ ఫుట్ ని చూపించారు. అటు మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ రిలీజ్ చేసిన సాంగ్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. కానీ, కథ పెద్దగా ముందుకు కదల్లేదు. డబ్బున్న అమ్మాయి మిడిల్ క్లాస్ అబ్బాయితో ప్రేమలో పడటం కాన్సెప్ట్ కొత్తది ఏమీ కాదు. కానీ, దానికి ధనుష్ ఇచ్చిన ట్రీట్మెంట్ బావుంది. మొత్తానికి ఈ సినిమాతో ధనుష్ మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తుంది..
ప్లస్ పాయింట్స్..
స్టోరీ లైన్ బాగుంది
యాక్టర్స్ అదిరిపోయే పర్ఫామెన్స్..
మ్యూజిక్
మైనస్ పాయింట్స్..
మధ్య మధ్యలో కాస్త డల్ అయ్యింది..
సెకండ్ ఆఫ్ కొంచెం ల్యాగ్..
సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి..
రేటింగ్ : 2.75/5