BigTV English

India vs Bangladesh: నా లాగే క్యాచ్ మిస్.. రోహిత్ శర్మ అదిరిపోయే రియాక్షన్!

India vs Bangladesh: నా లాగే క్యాచ్ మిస్.. రోహిత్ శర్మ అదిరిపోయే రియాక్షన్!

India vs Bangladesh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తమ వేటను విజయంతో మొదలుపెట్టింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ని 228 పరుగులకు అలౌట్ చేశారు భారత బౌలర్లు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహీద్ హ్రుదియ్ {100} సెంచరీ తో రాణించి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.


 

ఇక మరో బ్యాటర్ జాకీర్ అలీ సైతం 68 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలర్లలో మొహమ్మద్ షమి ఐదు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ మంచి శుభభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వేగంగా ఆడాలని ముందే డిసైడ్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నట్లు, పిచ్ బంగ్లా బౌలర్లకు సహకరిస్తున్నట్లు కనిపించింది. ఇక తొలి వికెట్ కి 9.5 ఓవర్స్ లోనే 69 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు.


ఆ తర్వాత విరాట్ కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులు చేసి నిరాశపరిచారు. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమ్ ఇండియాని విజయ తీరాలకు చేర్చాడు. ఇక గిల్ తన సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన హైట్రిక్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్ లో అక్షర్ పటేల్ 9.2, 9.3 బంతులకు తన్ జీత్, ముష్ఫికర్ వికెట్లను పడగొట్టాడు. ఈ రెండు క్యాచ్ లను కీపర్ కే.ఎల్ రాహుల్ మెరుపు వేగంతో పట్టేశాడు.

ఆ తరువాత నాలుగో బంతికి జాకీర్ అలీ కూడా పెవిలియన్ చేరాల్సింది. కానీ స్లిప్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సులువైన క్యాచ్ ని చివరి క్షణంలో వదిలేశాడు. బంతిని వదిలిన రోహిత్ శర్మ తనపై తానే అసహనం వ్యక్తం చేసుకుంటూ చేతిని గ్రౌండ్ కి బాధితు కనిపించాడు. ఆ తరువాత అక్షర పటేల్ కి సారీ చెప్పడం కనిపించింది. అయితే మ్యాచ్ అనంతరం తన తప్పిదం వల్లే అక్షర్ పటేల్ హైట్రిక్ వికెట్ మిస్ అయిందని రోహిత్ శర్మ అంగీకరించాడు. ఈ కారణంగా అక్షర్ పటేల్ ని డిన్నర్ కి తీసుకువెళతానని చెబుతూ నవ్వులు పూయించాడు.

అయితే అది చాలా ఈజీ క్యాచ్ అని, ఆ క్యాచ్ నీ తాను పట్టాల్సింది, ఈ స్థాయి క్రికెట్ లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదని, కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత ఇన్నింగ్స్ లో టస్కిన్ అహ్మద్ వేసిన 37వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 37వ ఓవర్ రెండవ బంతిని టస్కిన్ అహ్మద్ ఓవర్ పిచ్డ్ గా వేయగా.. కేఎల్ రాహుల్ దానిని స్క్వేర్ లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు.

 

ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జకీర్ అలీ చేతిలోకి బంతి వచ్చింది. కానీ అతడు బంతిని పట్టుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ తో పాటు టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఊపిరి పీల్చుకుంది. అందరికంటే రోహిత్ శర్మ ఎక్కువ సంతోషానికి గురయ్యాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్ ని రోహిత్ శర్మ నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కేఎల్ రాహుల్ క్యాచ్ ని జాకీర్ అలీ మిస్ చేయడంతో చెల్లుకు చెల్లు అన్నట్లుగా రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీంతో రోహిత్ శర్మ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×