Thammudu Movie Review : నితిన్ హిట్ టేస్ట్ చేయక దాదాపు ఐదేళ్లు అవుతుంది. భీష్మ తర్వాత వచ్చిన ఏ సినిమాకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఇయర్‌లోనే వచ్చిన రాబిన్ హుడ్ కూడా నిరుత్సాపరిచింది. అలాంటి టైంలో నితిన్ హోప్… “తమ్ముడు”. నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లు కుమ్మరించి ఈ సినిమాను నిర్మించాడు దిల్ రాజు. మరి అంతటి బడ్జెట్‌తో వచ్చిన తమ్ముడు మూవీ నితిన్‌కు ఐదేళ్ల నిరీక్షణకు తెరదించిందో లేదో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వైజాగ్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రసాయనాల వల్ల వందల మంది చనిపోతారు. ఆ ఫ్యాక్టరీ అజర్వాల్ (సౌరభ్ సచ్‌దేవా) అనే వ్యక్తిది. అతని డబ్బుతో మంత్రి, ముఖ్యమంత్రిలను కొనేస్తాడు. కానీ, బాధిత కుటుంబాలు న్యాయం కోసం పోరాటం చేస్తాయి. దీంతో విచారణ కమిటీ వేస్తుంది ప్రభుత్వం. ఆ విచారణ కమిటీకి హెడ్ ఝాన్సీ కిరణ్మాయి (లయ). వారికి న్యాయం చేస్తా అని మాట ఇస్తుంది. ఆ కమిటీని, ఝాన్సీని చంపాలని అజర్వాల్ చూస్తాడు.
ఇదిలా ఉండగా, జై (నితిన్) ఆర్చరీ ప్లేయర్. వరల్ట్ ఛాంపియన్‌లో నెగ్గి గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే జై గోల్. దీంట్లో జైకి సాయం చేస్తుంది చిత్ర (వర్ష బొల్లమ్మ). అయితే జైకు గేమ్‌పైన ఫోకస్ తగ్గుతుంది. దానికి కారణం… వాళ్ల అక్క స్నేహలత (లయ). వాళ్ల అక్కకు ఇచ్చిన మాట తిప్పాడు అనే గిల్టీ ఉంటుంది. దాన్ని సరిదిద్దు కోవడానికి అక్క కోసం వెళ్తాడు. ఈ క్రమంలో జై, చిత్ర, ఝాన్సీ కిిరణ్మాయి ఓ ఊరిలో చిక్కుల్లో పడుతారు.
ఆ చిక్కుల్లో నుంచి వాళ్లు బయటికి ఎలా వచ్చారు? ఈ చిక్కులకు రత్న (సప్తమీ గౌడ), గుత్తి (స్వస్తిక) లకు ఏం సంబంధం ఉంది. ప్రమాధ బాధితులకు ఝాన్సీ కిరణ్మాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుందా? జై వాళ్ల అక్కను కలిశాడా ? అనేది మిగితా స్టోరీ…
విశ్లేషణ :
సినిమాను ఎలా తీశారు? ఏ ఉద్దేశ్యంతో తెరమీదకు తీసుకొచ్చారు అని ఆలోచిస్తే చాలా కన్ ఫ్యూజన్ అవ్వాల్సిందే. సినిమా మొత్తం అక్క గురించి, అక్క కూతురి గురించి ఉంటుంది. అంటే ఇది ఫ్యామిలీ స్టోరీ. కానీ, ఫ్యామిలీలు చూడకుండా సెన్సార్ A సర్టిఫికేట్ తీసుకున్నారు.
పోనీ… A సర్టిఫికేట్‌కు న్యాయం చేసి.. ఆ వయోలెన్స్ అయినా… సరిగ్గా తీశారు అంటే సరైన మార్కులు ఇవ్వలేం. ఇక మరి ఏ ఉద్ధేశ్యంతో సినిమా చేశారో… దానికి సెన్సార్ నుంచి A సర్టిఫికేట్ ఎందుకు తెచ్చుకున్నారో వాళ్లకే తెలియాలి. కనీసం U/A తెచ్చుకుని ఫ్యామిలీ సెంటిమెంట్ ని బలంగా పెట్టుకుని ఆ వర్గం ఆడియన్స్‌ను అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేయాల్సింది. ఫాస్టాఫ్‌లో ఎక్కడా కూడా A సర్టిఫికేట్ సీన్స్ ఉండవు. సెకండాఫ్‌లో ఆ ఫైట్ సీన్స్ కాస్త ఉంటాయి. అవి కూడా మరీ అంత వయోలెన్స్‌గా ఏం లేవు. హాలీవుడ్ సినిమాలు, ఓటీటీల పుణ్యమా అని తెలుగు ఆడియన్స్ దీని కంటే భయంకరమైన వయోలెన్స్ సినిమాలు చూస్తున్నారు. అంటే సినిమాలో నితిన్ ఫోకస్ తగ్గినట్టు… డైరెక్టర్ కూడా సినిమాలో ఏ వర్గం ఆడియన్స్‌ను ఫోకస్ చేయాలో మిస్ అయినట్టు ఉన్నాడు.
ఇక కథలోకి వస్తే… ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా రెగ్యూలర్‌గా సాగుతుంది. కానీ, ఏదో జరుగుతుంది.. అంటూ ఆలోచిస్తూ థియేటర్‌లో కూర్చోపెట్టేలా చేశాడు.
అక్కను వెతుక్కుంటూ వర్ష బొల్లమ్మతో హీరో ఓ చిన్న పల్లెటూరుకు వెళ్తాడు. అక్కడ నుంచి యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ సినిమా పూర్తి అయ్యే వరకు.. అంటే ఫస్టాఫ్ చివర నుంచి క్లైమాక్స్ వరకు.
సెకండాఫ్ నుంచి సినిమా జానర్ ఒక్క సారిగా సర్వైవల్ యాక్షన్ గా మారిపోతుంది. సెకండాఫ్ మొత్తం ఒక అడవిలో ఒకే రాత్రిలో జరుగుతుంది. అజర్వాల్ ప్రయివేటు ఆర్మీ, ఆ గ్రామంలో ఉండే క్రూరమైన మనుషులతో హీరో అండ్ వాళ్ల అక్క ఫ్యామిలీ తప్పించుకుంటూ ఆ గ్రామాన్ని దాటాలి. ఈ క్రమంలో యాక్షన్ ఎపిసోడ్స్ బానే ఉన్నాయి. కానీ, ఒక్కో ఫైట్ సీన్ మరీ లెంతీగా ఉండటం ఒక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే ఫైట్ సీన్స్‌లో లాజిక్స్ కూడా చాలా మిస్ అయ్యాయి.
అయితే… ఆ ఫ్యామిలీలో ఓ ప్రెగ్నెంట్ ఉంటుంది. ఆమె డెలవరీ టైం సీన్స్ కాస్త సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. కానీ, ఇలాంటి సీరియస్‌నెస్ సీన్స్ టైంలో సప్తమీ గౌడతో ఓ కామెడీ ట్రాక్ పెట్టించారు. అది సెట్ అవ్వకపోగా… ఆడియన్స్ ఇరిటేట్ తెప్పించేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ కాస్త కొత్తగా ఉంటుంది. విలన్ పాత్ర బాగుంటుంది. ఆ పాత్ర ఎండింగ్ కూడా కొత్తగా ట్రై చేశారు. కాకపోతే, సినిమాలో ఎమోషన్స్ మిస్ చేయడం మరో మైనస్.
నితిన్ ఫర్మామెన్స్… గత సినిమాలతో పోలిస్తే బాగా చేశాడు అని చెప్పొచ్చు. ఎమెషనల్, యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. లయ కూడా పర్వలేదు ఇక వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పరిధి మేర నటించారు. ఇక విలన్‌గా సౌరభ్ సచ్‌దేవా అదరగొట్టాడు. ఆయనకు ఉన్న సమస్యతో కూడా విలనీజాన్ని చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అడవిలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. అజనీష్ లోకనాథ్ ఇంపాక్ట్ పెద్దగా కనిపించలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే… ఇంకాస్త వర్క్ చేయాల్సిందని అనిపిస్తుంది.
ప్లస్ ఫాయింట్స్ :
నితిన్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ & సాంగ్స్
ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవడం
మొత్తంగా : ఎమెషన్స్ లేని తమ్ముడు
Thammdu Movie Rating : 1.75 / 5