E-Paper
Advertisement

PSL 2026 Auction: PSLలోకి హైద‌రాబాద్ తో పాటు మ‌రో టీమ్ ఎట్రీ..తెర‌పైకి మ‌రో కావ్య పాప‌

PSL 2026 Auction: PSLలోకి హైద‌రాబాద్ తో పాటు మ‌రో టీమ్ ఎట్రీ..తెర‌పైకి మ‌రో కావ్య పాప‌
Advertisement

PSL 2026 Auction:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League Tournament ) కూడా చాలా రసవత్తరంగానే ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన వేలం జరిగింది. ఈ వేలం ప్లేయర్ల కోసం కాకుండా కొత్తగా రెండు జట్లను కొనుగోలు చేసే దానికోసం నిర్వహించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం రంగంలోకి మరో రెండు కొత్త జట్లు వచ్చాయి. వాటిని భారీ ధరకే కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లోకి కొత్తగా రెండు జట్లు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ వేలం ( PSL 2026 Auction ) నేపథ్యంలో కొత్తగా రెండు జట్లు తెరపైకి వచ్చాయి. ముందుగా అందరూ ఊహించినట్లుగానే ఆ రెండు జట్లను భారీ ధరకే కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. ఇందులో హైదరాబాద్ జట్టుతో పాటు సియాల్ కోట్ జట్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జట్టును ఏకంగా 1.75 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు అమెరికాకు చెందిన ఎఫ్ కె ఎస్ గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే 175 కోట్లకు హైదరాబాద్ జట్టును ( Hyderabad ) కొనుగోలు చేసింది ఈ అమెరికా కంపెనీ. హైదరాబాద్ అంటే పాకిస్తాన్ లో ఉండేది. మన హైదరాబాద్ తరహా లోనే పాకిస్తాన్ లో కూడా ఓ నగరానికి మన లాగే పేరు ఉంది. ఇక మరో సియాల్ కోట్ ( Sialkot ) జట్టును ఓజి డెవలపర్స్ అనే ఫ్రాంచైజీ 185 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే 1.85 బిలియన్ పాకిస్తాన్ రూపాయలు అనమాట. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో మొత్తం జట్ల సంఖ్య 6 నుంచి 8 కి చేరుకుంది. ఇకపై ఎనిమిది జట్లు బరిలోకి దిగుతాయి.

పాకిస్తాన్ లోనూ మరో కావ్య పాప

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ వేలం ( PSL 2026 Auction) నేపథ్యంలో తెరపైకి మరో కావ్య పాప ( Kavya maran) వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ PSL 2026 వేలం సందర్భంగా అచ్చం కావ్య పాప లాగే ఓ అమ్మాయి మెరిసింది. కానీ కావ్య పాప అందంగా ఉంటే.. పైన ఫోటోలో ఉన్న అమ్మాయి మాత్రం కాస్త లావుగా ఉంది. ఈమె హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన FKS ఫ్రాంచైజీకి చెందిన లేడీ అని తెలుస్తోంది. వేలం జరుగుతున్న సమయంలో కావ్య పాపా లాగానే సందడి చేసింది. దీంతో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండ‌గా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి మే మూడవ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×