Pushpa 2 Movie Review and Rating : ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇదివరకే రిలీజ్ అయి ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంది.? అల్లు అర్జున్ చెప్పినట్లు బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సినిమా స్థాయిలో ఉందా.? పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తాడా.? అసలు ఈ సినిమా కథాంశం ఏంటి.? అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
తనకు రావలసిన డబ్బులు రాలేదని అవి వసూలు చేసుకోవడానికి, ఎర్రచందనం తరలించే కంటైనర్ లో ఏకంగా జపాన్ కి వెళ్ళిపోతాడు పుష్ప. జపాన్ లోనే ఈ సినిమా కథ మొదలవుద్ది. పుష్ప( Allu Arjun) కు చిత్తూరు జిల్లాలో మంచి పేరు ఉంటుంది. సీఎంను కూడా కలిసి మాట్లాడగలగే స్థాయి ఉంటుంది. శ్రీవల్లి (Rashmika) కోరిక మేరకు సీఎంతో ఫోటో దిగే ప్రయత్నం చేస్తాడు పుష్పరాజు. ఒక స్మగ్లర్ తో మా స్థాయి ఉన్నవాళ్లు ఫోటోలు దిగకూడదు అంటూ పుష్పరాజు ఇగో ను హర్ట్ చేస్తాడు సీఎం. ఇక తనకు సిండికేట్ అప్పజెప్పిన మంత్రిని సీఎం చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇంతకు మంత్రిగా ఉన్న రావు రమేష్ ను సీఎం చేశాడా.? సీఎం చేయడానికి పుష్ప రాజు ప్రయత్నాలు ఏమిటి.? షేకావత్ కి పుష్పరాజు కు మధ్య ఎటువంటి క్లాసెస్ వచ్చాయి.? వీటన్నిటి మధ్యలో పుష్పరాజు కుటుంబ పరిస్థితి ఏమిటి.? అనే అంశాలు తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ :
దర్శకుడు సుకుమార్ సినిమాలు అంటే హీరోలు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. అది ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. హీరో క్యారెక్టర్రైజేషన్ పట్టుకొని సినిమాను నడిపించడం సుకుమార్ బలం. ఆఖరికి రంగస్థలం వంటి సినిమాలో కూడా చరణ్ కి ఒక లోపం పెట్టిన తన ఇంటిలిజెన్స్ తో గూజ్ బంప్స్ వచ్చే హై క్రియేట్ చేశాడు. ఇక పుష్ప విషయంలో కూడా అదే పంథా కొనసాగించాడు సుకుమార్. కొన్ని సీన్స్ లో సుకుమార్ ఇంటెలిజెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అలానే పుష్పరాజు తీసుకున్న కొన్ని డెసిషన్స్ లో సుకుమార్ మార్క్ ఉంటుంది.
అల్లు అర్జున్ విషయానికొస్తే ఈ సినిమానికి ప్రాణం పెట్టేసాడు అని చెప్పాలి. ఈ స్థాయిలో పర్ఫామెన్స్ ఇచ్చే స్కోప్ ముందు సినిమాల్లో కూడా దొరకకపోవచ్చు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ విలయతాండవం చేసి థియేటర్ లో ప్రళయం పుట్టించాడు. ఈ క్యారెక్టర్ ను సుక్కు నడిపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. యాక్టింగ్ అదిరిపోయిన కూడా మ్యాననరిజం లో కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఆడియన్ కి మొదలవుతుందని చెప్పాలి. అల్లు అర్జున్ పాన్ నములుతూ చెప్పే డైలాగ్స్ కొన్ని ఆడియన్స్ కి క్లారిటీగా అర్థం కావు.
శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. అలానే ఈ పాత్రను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు సుకుమార్. ముఖ్యంగా జాతర సీన్ లో పుష్ప రాజు అరాచకం అయిపోయిన తర్వాత, శ్రీవల్లి నటించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా పాత్రలలో నటించిన వాళ్లంతా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. షేకావత్ ఎంట్రీ సీను సుక్కు డిజైన్ చేసిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయింది. అలా నా క్యారెక్టర్ కూడా మంచి హై ఇచ్చింది అని చెప్పాలి.
ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే క్యూబా సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. ప్రతి ఫ్రేమ్ లో అతని కష్టం కనిపిస్తుంది. కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించేలా ఉంటుంది సినిమాటోగ్రఫీ. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ సినిమా అంటేనే రెచ్చిపోతాడు. కొన్ని సీన్స్ ని బిజిఎంతో దేవిశ్రీప్రసాద్ ఎలివేట్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ బిజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన శ్యామ్ కూడా తన మార్కు చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో శ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడారు అనిపిస్తుంది. ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా అద్భుతంగా వర్కౌట్ అయ్యేది అని చెప్పాలి. నవీన్ నూలి ఎడిటింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి లెంత్ కొద్దిపాటి మైనస్ అవుతుంది.
ప్లస్ పాయింట్స్ :
సుకుమార్ డైరెక్షన్
పుష్ప రాజు క్యారెట్రైజేషన్
ఎలివేషన్స్ & ఎమోషనల్ సీన్స్
యాక్షన్ సీక్వెన్సెస్
బ్యాక్గ్రౌండ్ స్కోర్
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్
క్యూబా సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
ల్యాగ్ సన్నివేశాలు
విలవిజం బలహీనం
కొన్ని సీన్స్ లో సుకుమార్ మార్క్ మిస్సింగ్
యాక్షన్ సీన్స్ హై గా ఉన్న లాజిక్స్ మిస్సయ్యారు
మొత్తంగా : అక్కడక్కడ తగ్గినా.. మొత్తానికి పుష్ప 2 మాత్రం ‘తగ్గేదేలే’
Pushpa 2 Movie Rating: 2.5/5