E-Paper
Advertisement

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!
Advertisement

Puneeth Rajkumar:పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar).. కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన ఈయన అభిమానుల చేత అప్పు అని ముద్దుగా పిలిపించుకున్నారు. ప్రముఖ నటుడిగా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ 6 నెలల వయసులో కెమెరా ముందుకు వచ్చి బాల నటుడిగా అనేక చిత్రాలలో నటించారు. 1985లో వచ్చిన బెట్టద హూవు అనే చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.2002 లో వచ్చిన అప్పు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి భారీ విజయాన్ని అందుకున్న ఈయనను.. అప్పటినుంచి అభిమానులు అప్పు అని ప్రేమగా పిలిపించుకుంటున్నారు. భారీ సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పునీత్ రాజ్ కుమార్ కెరియర్ పీక్స్ లో ఉండగానే 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

పునీత్ మరణానికి ముందు ఏం జరిగిందంటే?

నటుడిగానే కాకుండా దానధర్మాలు చేస్తూ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరు సొంతం చేసుకున్న పునీత్ మరణాన్ని ఆయన అభిమానులే కాదు యావత్ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే పునీత్ మరణానికి కారణం గుండెపోటు అనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నా.. అసలు ఆ గుండెపోటు రావడానికి గల కారణం ఏమిటి? ఆ ఒక్క క్షణం ఏం జరిగింది ?అనే విషయాలపై తాజా డాక్టర్ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఆ గంటన్నరే పునీత్ మరణానికి కారణం?

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాల గురించి పునీత్ రాజ్ కుమార్ పర్సనల్ డాక్టర్ రమణారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. అసలు విషయాన్ని బయటపెట్టారు . పునీత్ 2021 అక్టోబర్ 29న మరణించారు.. అయితే ఆరోజు ఆయన తొలిసారి కిక్ బాక్సింగ్ ట్రై చేశారు. సుమారుగా గంటన్నర పాటు కిక్ బాక్సింగ్ చేసి అలసిపోయి.. మా క్లినిక్ కి వచ్చారు. అయితే అప్పుడు మేము.. ఈసీజీ చేయగా గుండె బాగా అలసిపోయిందని గుర్తించాము.

also read:చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

ఒక్క క్షణం.. పునీత్ హార్ట్ బీట్ ఆగిపోయింది..

Advertisement

ఇక మరో నిమిషంలో హాస్పిటల్ కి చేరుతాము అనగా ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. ఆ నిమిషం పాటు దేవుడు మరిచిపోయి ఉండుంటే .. నేడు పునీత్ మన మధ్య సంతోషంగా ఉండేవారు అంటూ అసలు నిజం బయటపెట్టారు డాక్టర్ రమణారావు. మొత్తానికైతే ఎప్పుడు చేయని కిక్ బాక్సింగ్ ఏకంగా విశ్రాంతి లేకుండా గంటన్నర పాటు చేయడమే ఆయన మరణానికి కారణమనే విషయాన్ని డాక్టర్ చెప్పడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈ విషయం ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక అనే చెప్పాలి.. వ్యాయామాలు చేయడం మంచిదే కానీ అలవాటు లేని వ్యాయామాలు గంటలు తరబడి చేసి గుండెపై భారం తీసుకురాకూడదు అని హెచ్చరిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన ఆ చిన్న తప్పు ఏకంగా.. ఆయనను కానరాని లోకానికి తీసుకెళ్ళిందని నెటిజన్స్ భావిస్తున్నారు.

గొప్ప సంఘ సంస్కర్త కూడా..

పునీత్ రాజకుమార్ సినిమాల ద్వారా వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగం సమాజ సేవకే ఉపయోగించారు. ఆయన అనేక ఉచిత పాఠశాలలు, అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి గొప్ప పరోపకారిగా నిలిచారు.. కర్ణాటక ప్రభుత్వం ఆయన మరణాంతరం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించింది.

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

Big Stories

Advertisement
×