BigTV English

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

Coolie Movie Review : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా, సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన సినిమా కూలీ. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలామంది స్టార్ హీరోలో నటించారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ వంటి స్టార్స్ నటించడంతో ఈ ప్రాజెక్టు మీద క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది. ఇక నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.


కథ :
ఒక మ్యాన్షన్ హౌస్ నడిపిస్తూ ఉంటాడు దేవా (Rajinikanth) . దేవా తో పాటు కొంతమంది మనుషులు ఉంటారు. అయితే సడన్ గా దేవా స్నేహితుడు (Sathyaraj) చనిపోయిన వార్తను వింటాడు. అయితే ఆ చనిపోయిన స్నేహితుడు హార్ట్ ఎటాక్ తో కాకుండా, ఎవరు కొట్టడం వల్లనే చనిపోయాడు అని విషయాన్ని కనుక్కుంటాడు. అయితే అక్కడ నుంచి ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయడంతో కథ మొదలవుతుంది. తన స్నేహితుడు చావు గురించి తెలుసుకునే ప్రాసెస్ లో దేవా ఒక హార్బర్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత దేవా ఎటువంటి పరిస్థితులు చూశాడు.? ఆ హార్బర్ ఇటువంటి ఇల్లీగల్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయి. ? మ్యాన్షన్ హౌస్ ను నడపకు ముందు దేవా ఏం చేసేవాడు.? సైమన్, దయాల్, తో దేవా సంబంధం ఏమిటి.? ఇంతకు కథలో ప్రీతి (Shruti Hassan) ఎవరు.? స్నేహితుడును చంపిన వాడిని వెతుక్కుని వెళ్లే ప్రాసెస్ లో అసలు దేవా ఏం తెలుసుకున్నాడు.? ఇటువంటి అంశాలు చూడాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
ఒక సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు వాళ్లను డీల్ చేసే విధానం కూడా తెలియాలి. దీనిలో లోకేష్ కనకరాజ్ ఎక్స్పెక్ట్ అని విక్రమ్ సినిమాతో మన అందరికీ అర్థమైంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా స్టార్స్ ను డీల్ చేయడంలో ఎటువంటి ఫెయిల్యూర్ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ లో కనిపించే ముగ్గురు స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ డ్యూరేషన్, పర్ఫెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది.


అలానే సెకండ్ హాఫ్ లో కూడా మంచి సప్రైజెస్ ప్లాన్ చేశాడు లోకేష్. ముఖ్యంగా ఉపేంద్రను డీల్ చేసిన విధానం, అలానే అమీర్ ఖాన్ చూపించిన విధానం ఇవి అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రజనీకాంత్ లో ఏ అంశాలు ఇష్టపడతారో వాటిని అక్కడక్కడ ప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు దర్శకుడు. ముఖ్యంగా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు అని సినిమా చూస్తే అర్థమవుతుంది.

రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ అంటే స్లో మోషన్, ఎలివేషన్ అని చెబుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అంతకుమించి రజనీకాంత్ నటన ఆకట్టుకుంది. శృతిహాసన్ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా నాగర్జున గురించి చెప్పుకోవాలి. పేరుకు విలన్ రోల్ చేసినా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా సినిమాలో నాగార్జున మీద కోపం రాదు. ఇంత స్టైలిష్ గా క్యారెక్టర్ డిజైన్ చేశాడు లోకేష్. సౌబిన్ ఈ సినిమాలో ఒక ఫుల్ లెన్త్ రోల్ చేశాడు. అసలైన విలనిజాన్ని పండించాడు. ఉపేంద్ర కనిపించేది కొద్దిసేపు అయినా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలానే అమీర్ ఖాన్ ను రోలెక్స్ మాదిరిగా చివర్లో చూపించి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు.

ముఖ్యంగా ఈ సినిమాను నిలబెట్టింది మాత్రం అనిరుద్. రజనీకాంత్ సీన్స్ వర్కౌట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అనిరుద్. పాటలు అద్భుతంగా ఉండటమే కాకుండా, సీన్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ తో సినిమా ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది.

గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ చాలా నీట్ గా ఉంది. కొన్ని సీన్స్ లో లైటింగ్ అదిరిపోయింది. సినిమా ఇంత అందంగా రావడానికి గిరీష్ గంగాధర్ సినిమాగ్రఫీ మంచి ప్లస్ అయింది.

అయితే దర్శకుడు లోకేష్ మంచి కథను రాసుకున్నాడు. అని చూపించే విధానంలో కొద్దిగా తడబడ్డాడు అని చెప్పాలి. లోకేష్ కథను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెబుతాడు. అయితే ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నాన్ని చేశాడు. అద్భుతమైన సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయినా కూడా మధ్యలో కొన్ని సీన్స్ డల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని ఇంకా లోకేష్ చాలా బాగా చెప్పగలడు అని ఆలోచన అయితే తప్పకుండా వస్తుంది.

విక్రమ్ సినిమాను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెప్పినా కూడా అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ సినిమా విషయానికొస్తే అది కొద్దిగా మిస్ అయింది అని చెప్పాలి. కొన్ని సీన్స్ ను ఇంకా ట్రిమ్ చేసే అవకాశం ఉంది. పిలోమన్ రాజ్ ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా ప్లస్ అయ్యేది. రజినీకాంత్ ఎలివేషన్ పక్కనపెట్టి ఎమోషన్ గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేశాడు. కొన్ని ఎలివేషన్స్ సీన్స్ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ, డైరెక్షన్
క్యారెక్టర్రైజేషన్స్
అనిరుద్ మ్యూజిక్
గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కొన్ని ల్యాగ్ సీన్స్
ఎడిటింగ్

మొత్తంగా : ఓపికతో కూర్చుంటే కూలీ కొంత వరకు న్యాయం చేసినట్లే

Coolie Movie Rating: 2.25/5

Related News

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Big Stories

×