BigTV English

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

రివ్యూ : ‘బాఘీ 4’ హిందీ మూవీ
దర్శకుడు: ఎ. హర్ష
నటీనటులు: టైగర్ ష్రాఫ్ (రాణీ), సంజయ్ దత్ (విలన్), సోనమ్ బజ్వా (ప్రతిష్ఠ), హర్నాజ్ సంధు (అలీషా), శ్రేయాస్ తల్పాడే (జీతూ)
నిర్మాత : సాజిద్ నడియాడ్వాలా
నిర్మాణ సంస్థ : నడియాడ్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్టైన్మెంట్


Baaghi 4 Review : ‘బాఘీ’ ఫ్రాంచైజ్‌లో నాల్గవ చిత్రం ‘బాఘీ 4’. యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా ఎలిమెంట్స్‌తో మోస్ట్ వయొలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా సౌత్ దర్శకుడు ఎ. హర్ష హిందీ డెబ్యూ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈరోజే హిందీ, తెలుగు భాషల్లో తెరపైకి వచ్చిన ‘బాఘీ 4’కు సెన్సార్ బోర్డు నుంచి 23 కట్స్ తో ‘ఏ’ సర్టిఫికెట్ రావడం కూడా మూవీపై బజ్ పెరగడానికి మరో కారణం. మరి ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ

మూవీ రాణీ (టైగర్ ష్రాఫ్) అనే నేవీ ఆఫీసర్‌ ఎంట్రీతో మొదలవుతుంది. అతను ఒక ఘోరమైన రైలు ప్రమాదం నుండి బయట పడతాడు, కానీ అతని ప్రియురాలు అలీషా (హర్నాజ్ సంధు) ఆ ప్రమాదంలో చనిపోతుంది. దీంతో తనవల్లే ఆమె చనిపోయిందన్న అపరాధ భావనతో నిరాశలో మునిగిపోతాడు. అప్పటి నుంచి రాణీకి అదే పనిగా అలీషా హాల్యూసినేషన్స్ కనిపిస్తాయి. ఆమె అతనితో మాట్లాడుతూ అతని మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఈ క్రమంలో అతని సన్నిహిత స్నేహితుడు జీతూ (శ్రేయాస్ తల్పాడే), సైకియాట్రిస్ట్ ప్రతిష్ఠ (సోనమ్ బజ్వా) అలీషా నిజమా లేక రాణీ ఊహానా అని సందేహిస్తారు. ఆ తరువాత ఓ ఊహించని ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. పవర్ ఫుల్ విలన్ (సంజయ్ దత్) జరిగిన రైలు ప్రమాదంలో కీలకపాత్రధారి అనే సీక్రెట్ బయట పడుతుంది. ఆ తరువాత హీరో ఏం చేశాడు? విలన్ ఎందుకలా చేశాడు? క్లైమాక్స్ ఏంటి ? అన్నది స్టోరీ.


విశ్లేషణ 

ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఇది కథన పేస్‌ను డౌన్ చేసింది. అలీషా రియాలిటీ ట్విస్ట్, ప్రతిష్ఠ నమ్మకద్రోహం వంటి కొన్ని సీన్స్ ఊహకందడంతో, సస్పెన్స్‌ థ్రిల్ మిస్ అవుతుంది. కథలో లాజిక్ లోపాలు కావాల్సినన్ని ఉన్నాయి. ముఖ్యంగా రైలు ప్రమాదం కుట్ర, రొమాంటిక్ సన్నివేశాలలో డైలాగ్‌లు చిరాకు పుట్టిస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం లేకుండానే క్లైమాక్స్ ను హడావిడిగా ముగించారు. ‘మర్జానా’, ‘గెట్ రెడీ టు ఫైట్’ పాటలు యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తాయి. రైలు ప్రమాద సన్నివేశం VFX హైలైట్‌గా నిలుస్తుంది.ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. స్లో ఫస్ట్ హాఫ్, ఊహించదగిన ట్విస్ట్‌లు, బలహీనమైన రైటింగ్ సినిమాను ‘బాఘీ 2’ స్థాయికి తీసుకెళ్లలేకపోయాయి. టెక్నికల్‌గా… సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, VFX స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్, రొమాంటిక్ సన్నివేశాలు నిరాశపరిచాయి.

టైగర్ ష్రాఫ్ స్టంట్‌లు… ముఖ్యంగా రైలు ప్రమాదం, క్లైమాక్స్ ఫైట్ ను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇవి యాక్షన్ అభిమానులను ఫీస్ట్. టైగర్ ష్రాఫ్ రాణీగా ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. సంజయ్ దత్ విలన్‌గా బలమైన ప్రెజెన్స్‌ను అందిస్తాడు. మిగతా నటీనటులు పర్లేదు అన్పించారు.

ప్లస్ పాయింట్స్ 

నటీనటులు
యాక్షన్ సీక్వెన్స్ లు
మ్యూజిక్
క్లైమాక్స్ ఫైట్

మైనస్ పాయింట్స్

స్లో ఫస్ట్ హాఫ్
ఊహించదగిన ట్విస్ట్‌లు
బలహీనమైన రైటింగ్

మొత్తానికి 

టైగర్ ష్రాఫ్ కోసం ఓసారి చూడొచ్చు.

Baaghi 4 Rating : 1.25/5

Tags

Related News

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×