BigTV English
Advertisement

Mirai Twitter Review: ‘మిరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. తేజా అకౌంట్ లో మరో బ్లాక్ బాస్టర్..?

Mirai Twitter Review: ‘మిరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. తేజా అకౌంట్ లో మరో బ్లాక్ బాస్టర్..?

Mirai Twitter Review : గత ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన హీరో తేజ సజ్జా.. ఈ మూవీ తర్వాత ఆయన చేస్తున్న మూవీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. అయితే హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ సినిమా రావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడడంతో తేజ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. తేజా మిరాయ్ మూవీతో ఇవాళ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి క్వాలిటీ సినిమాని చూడబోతున్నాము అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పటివరకు మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఏ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో? ట్విట్టర్ రివ్యూ ఒకసారి చూసేద్దాం..


ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మీరు చూడలేని అత్యుత్తమ ఫ్రేమ్ ప్రభాస్ ది.. సెపరేట్ ఇండస్ట్రీ రెబల్‌వుడ్ నే నడుపుతున్నాడు అయ్య.. ఇదే హైలెట్ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

 

ఈ మూవీ మరో హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఒక విజువల్ వండర్ లోకి తీసుకొని వెళ్తుంది. సినిమా సూపర్. థియేటర్ మొత్తం ఈ సీన్స్ తో దద్దరీల్లిపోతుంది.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

 

తేజా సజ్జ సక్సెస్ ఈ మూవీతో కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ మైండ్ బ్లాక్.. సెకండ్ ఆఫ్ సినిమాకు హైలెట్ అవుతుంది. థియేటర్లను షేక్ చేసిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా అంటూ ట్వీట్ చేశారు.

 

కేవలం ఒక వాయిస్ ఓవర్ సినిమా రిసెప్షన్ మొత్తాన్ని రెబల్ వైబ్‌గా మార్చింది. డార్లింగ్ పేరు ఉంటే సినిమా సక్సెస్ ని టాక్ అందుకున్నట్లు. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

గొప్ప హృదయం ఉన్న ప్రభాస్ గారికి ఈ సినిమా చాలా స్పెషల్‌గా మార్చచారు. అందుకు ఎంతో రుణపడి ఉంటాను. ప్రారంభంలో వచ్చే రెబల్ స్టార్‌ను మీరు అసలు మిస్ కావొద్దు అని ట్వీట్ చేశారు.. అదే ఈ మూవీకి హైలెట్ అయ్యింది…

 

చూస్తుంటే మిరాయ్ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యాయి. మొదటి షోతోనే ప్రభాస్ మేనియా తో మూవీ ముందుకు వెళ్తుంది. మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ప్రీమియర్ షోలు ప్లస్ అవుతున్నాయి. థియేటర్లలో మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ప్రేక్షకులకు ఓ భారీ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. నటనలో తేజా సజ్జా – మంచు మనోజ్ బెస్ట్ ఇచ్చారని పబ్లిక్ అంటున్నారు. ఇప్పటి వరకు తెరపై చూడని కథ, సన్నివేశాలకు తగ్గట్టు సాగే నేపథ్య సంగీతం, అన్నిటికీ మించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిది. అయితే లెంగ్త్ ఎక్కువ కావడం, కామెడీ క్లిక్ కాకపోవడం, విలన్ ఫ్లాష్‌ బ్యాక్‌లో స్పార్క్ మిస్ అవ్వడం వంటివి పంటికింద రాయిలా తగిలేవి.. మిగితా అంతా బాగుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఈ మూవీ రెస్పాన్స్ హిట్ టాక్ ను అందించనుంది. చూద్దాం ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో..

Related News

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Thamma Twitter Review: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?

KRamp Movie Review : కె ర్యాంప్ రివ్యూ

K ramp Twitter Review: ‘కే ర్యాంప్’ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ పడినట్లేనా..?

Dude Movie Review: ‘డ్యూడ్’ మూవీ రివ్యూ: సారీ డ్యూడ్ ఇట్స్ టూ బ్యాడ్

Telusu kada Review : ‘తెలుసు కదా’ రివ్యూ : కష్టం కదా

Dude Twitter Review: ‘డ్యూడ్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×