Skin care tips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మార్కెట్‌లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల వచ్చే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని సార్లు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో తయారు చేసిన హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిది. ఇవి తక్కువ సమయంలోనే ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేస్తాయి. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతే కాకుండా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మరి లాభాలు ఉన్న హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోం మేడ్ ఫేస్ ప్యాక్స్:
1. కాఫీ పౌడర్, పెరుగుతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
కాఫీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు- 1/2 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా కాఫీ పౌడర్, పెరుగులను పైన తెలిపిన మోతాదులో తీసుకుని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖాన్ని అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. నిమ్మరసం, తేనెతో ఫేస్ ప్యాక్:
నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి, తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
కావాల్సినవి:
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ తేనె
తయారీ విధానం: పైన తెలిపిన మోతాదుల్లో నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. అయితే, సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసం నేరుగా వాడకుండా కొద్దిగా నీళ్లు కలిపి వాడటం మంచిది. దీన్ని సాయంత్రం వేళల్లో ముఖానికి అప్లై చేయడం ఉత్తమం. ఎందుకంటే నిమ్మరసం రాసి ఎండలోకి వెళ్తే చర్మం నల్లబడే అవకాశం ఉంది.
3. అలోవెరా జెల్:
అలోవెరా చర్మాన్ని చల్లగా ఉంచి, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖంపై మచ్చలను కూడా తొలగిస్తుంది.
కావాల్సినవి:
అలోవెరా జెల్
తయారీ విధానం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ను ముఖానికి రాసి మర్దన చేయాలి. ఉదయం చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని రిపేర్ చేసి, కొత్త కణాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది.
4. పాలు, బాదం పొడితో ఫేస్ ప్యాక్:
పాలు, బాదంపొడి మిశ్రమం చర్మాన్ని శుభ్రపరచి, పోషణనిస్తుంది.
కావాల్సినవి:
1 టేబుల్ స్పూన్ పాలు
1 టేబుల్ స్పూన్ బాదం పొడి
తయారీ విధానం: ఈ రెండింటినీ కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మృత కణాలను తొలగిస్తుంది.
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ చర్మం సహజంగానే కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే.. ఏదైనా కొత్త చిట్కాను పాటించే ముందు మీ చర్మంపై చిన్న భాగంలో పరీక్షించుకోవడం మంచిది.