E-Paper
Advertisement

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం..  ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?
Advertisement

Smit Machchhar Gets Special Honour: ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన తెగువను గుర్తించిన గుజరాత్‌ ప్రభుత్వం ‘విశిష్ట గుజరాత్‌ గరిమా’ అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

స్మిత్‌ మచ్చర్‌కు ప్రతిష్టాత్మక  పురస్కారం!

సెప్టెంబరు 30న దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కాక్‌పిట్‌లో దాడి జరిగింది. యెమన్ కు చెందిన కో పైలెట్ దాడిలో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడికి పాల్పడిన కో పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌ లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో అద్భుతమైన చూపిన ధైర్యాన్ని గుర్తిస్తూ స్మిత్‌ మచ్చర్‌కు ‘విశిష్ట గుజరాత్‌ గరిమా’ అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్‌ ప్రకటించారు. మచ్చర్‌ ధైర్యం గుజరాత్‌తో పాటు దేశానికి గర్వకారణమని ఆయన వెల్లడించారు.

గాయాలైనా వెనక్కి తగ్గలేదు!

Advertisement

కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో మచ్చర్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. విమానం తబూక్‌లో ల్యాండ్‌ అయిన వెంటనే ఆయనను అక్కడి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స, శస్త్రచికిత్స అనంతరం తదుపరి వైద్యం కోసం ఆయనను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ ఆసుపత్రికి వెళ్లి మచ్చర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మచ్చర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన మాట్లాడుతున్నారని రాయబారి వెల్లడించారు.

సోమనాథ్‌లో ప్రత్యేక పూజలు!

స్మిత్‌ మచ్చర్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ గుజరాత్‌లోని ప్రముఖ సోమనాథ్‌ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక మహాపూజ, మంత్రజప కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Advertisement

ఈ ఘటన తర్వాత స్మిత్‌ మచ్చర్‌ ధైర్యంపై భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా సహా పలు దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనను అభినందించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ విమానంలోని ప్రయాణికుల భద్రత కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.

Read Also: చెప్పడం కాదు.. చేసి చూపించాడు.. పైలట్‌ బాధ్యత గురించి స్మిత్ మచ్చర్ పాత పాడ్‌కాస్ట్ వైరల్!

Tags

Related News

మరణశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

చెప్పడం కాదు.. చేసి చూపించాడు.. పైలట్‌ బాధ్యత గురించి స్మిత్ మచ్చర్ పాత పాడ్‌కాస్ట్ వైరల్!

ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!

రైలు టికెట్ బుక్ చేశారా? ప్రయాణం కుదరకపోతే సింపుల్ గా వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×