E-Paper
Advertisement

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!
Advertisement

iPhone Duo: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ మోడల్ ‘ఐఫోన్ డ్యూయో’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆఖరి త్రైమాసికంలోనే సేల్స్ ప్రారంభం కానున్నప్పటికీ.. దీనికి ఉన్న క్రేజ్ చూస్తుంటే సేల్స్ రికార్డులు తిరగరాసేలా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు మొదలుకానుండగా, అక్టోబర్ 23 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా ఫోల్డబుల్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్న యాపిల్.. సరికొత్త అనుభూతిని అందించడానికి ఈ మోడల్‌ను తీర్చిదిద్దింది.

ధర, ప్రత్యేకతలు:

భారత మార్కెట్లో 256జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,99,900గా నిర్ణయించారు. అత్యంత ప్రీమియం కేటగిరీలో వచ్చిన ఈ ఫోన్‌లో ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. లోపలి భాగంలో 7.6 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్, బయట 5.4 అంగుళాల డిస్‌‌ప్లే ఇచ్చారు. లేటెస్ట్ ఏ20 ప్రో చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 27.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.

Advertisement

Also Read: బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!

మార్కెట్ అంచనాలు:

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 60 లక్షల ఐఫోన్ డ్యూయో ఫోన్లను యాపిల్ షిప్‌మెంట్ చేయనుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రారంభంలో స్టాక్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెంచనున్నారు. ప్రపంచ ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో యాపిల్ ఏకంగా 25 శాతం వాటాను కైవసం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పోటీ, మార్కెట్ షేర్:

Advertisement

ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్‌లో శాంసంగ్ 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. హువావే 22 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు యాపిల్ రాకతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. శాంసంగ్, హువావేలతో పాటు మోటరోలా, గూగుల్, షియోమీ, వివో, ఒప్పో వంటి సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి.

డిమాండ్ పెరగొచ్చు:

ప్రపంచవ్యాప్తంగా 2026 చివరి నాటికి 10 కోట్లకు పైగా ఫోల్డబుల్ ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. అలాగే 2027 నాటికి ఈ మార్కెట్ 37 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. యాపిల్ ఎంట్రీతో ఫోల్డబుల్ ఫోన్ల విక్రయాలు రానున్న రోజుల్లో మరింత ఊపందుకుని, అందరి చేతుల్లోనూ కనిపించేలా మారనున్నాయి.

Also Read: టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

Tags

Related News

లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు..ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అదుర్స్!

మోటో, ఒప్పో, ఐఫోన్ లవర్స్‌కి పండగే పండగ.. ఏ ఫోన్ ఎంత తక్కువకొస్తుందో తెలిస్తే షాకే!

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు

అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!

ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?

Big Stories

Advertisement
×