Best Personal Air Coolers: ప్రస్తుత రోజుల్లో ఉక్కపోతను తట్టుకోవడానికి ఎయిర్ కూలర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే పెద్ద పెద్ద డెసర్ట్ కూలర్లు గదిలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ, ఒక చోటు నుంచి మరొక చోటికి మార్చడానికి ఇబ్బందిగా మారుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారమే కాంపాక్ట్ లేదా పర్సనల్ ఎయిర్ కూలర్లు. ఇవి సైజులో చిన్నగా ఉంటూనే, పవర్‌ఫుల్ ఎయిర్ త్రోతో ఏసీ లాంటి చల్లదనాన్ని అందిస్తాయి. బజాజ్, క్రాంప్టన్, సింఫనీ వంటి టాప్ బ్రాండ్ల నుంచి జులై నాటికి మార్కెట్లో ట్రెండ్ అవుతున్న 5 బెస్ట్ కాంపాక్ట్ కూలర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న గదులు లేదా స్టడీ రూమ్స్ కోసం బజాజ్ నుంచి వచ్చిన ఈ పర్సనల్ కూలర్ ఒక అద్భుతమైన ఛాయిస్. ఇది కేవలం 100 వాట్ల కరెంట్ మాత్రమే ఖర్చు చేస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు భయం ఉండదు. ఇందులో.. అమర్చిన హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్లు, హెక్సాకూల్ టెక్నాలజీ గదిని చాలా వేగంగా చల్లబరుస్తాయి. దీని కాంపాక్ట్ బాడీ , లైట్ వెయిట్ డిజైన్ వల్ల ఇంటిలో ఒక చోటు నుంచి మరో చోటికి సులవుగా మార్చుకోవచ్చు. మార్కెట్లో దీని ప్రస్తుత ధర సుమారుగా రూ.5,977 నుంచి రూ. 6,500 వరకు అందుబాటులో ఉంది.
క్రాంప్టన్ బ్రాండ్ ఎల్లప్పుడూ లాంగ్-లాస్టింగ్ క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ మార్వెల్ నియో పర్సనల్ కూలర్ పవర్‌ఫుల్ ఎయిర్ డెలివరీతో వస్తుంది. ఇది గదిలోని ప్రతి మూలకు చల్లటి గాలిని చేరవేస్తుంది. ఇందులో.. ఉండే ఐస్ ఛాంబర్ ఫీచర్ ద్వారా మరింత వేగవంతమైన కూలింగ్ పొందవచ్చు. ఇన్వర్టర్ ఫ్రెండ్లీ కావడం వల్ల పవర్ కట్స్ ఉన్న సమయంలో.. కూడా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.8,900 వరకు ఉంటుంది.
మీ గదిలో స్థలం చాలా తక్కువగా ఉంటే టవర్ డిజైన్‌లో.. వచ్చే సింఫనీ డైట్ కూలర్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ స్లిమ్ అండ్ స్టైలిష్ కూలర్ గది మూలలో ఈజీగా సర్దుపోతుంది. ఇందులో.. సింఫనీ వారి ప్రత్యేకమైన ‘i-Pure’ టెక్నాలజీ ఉంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా , దుమ్ము ధూళిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ సమయం కూలింగ్ ఇవ్వడం దీని ప్రత్యేకత. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5,991 నుంచి రూ. 6,499 వరకు పలుకుతోంది.
పర్సనల్ కూలర్ కేటగిరీలోనే.. కాస్త ఎక్కువ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 36 లీటర్ల ట్యాంక్ ఉండటం వల్ల రాత్రంతా పదే పదే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఇందులోని టర్బో ఫ్యాన్ టెక్నాలజీ 30 అడుగుల దూరం వరకు పవర్‌ఫుల్ గా గాలిని విసురుతుంది. బెడ్‌రూమ్స్ ,మీడియం సైజ్ రూమ్స్ కోసం ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5,999 నుంచి రూ.6,800 వరకు అందుబాటులో ఉంది.
Also Read: రూ.1,500 లోపే బెస్ట్ స్మార్ట్‌వాచ్.. బోట్ ఎక్స్‌టెండ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండీ గ్రే అండ్ వైట్ లుక్‌తో వచ్చే ఈ క్రాంప్టన్ కూలర్ మీ రూమ్ ఇంటీరియర్‌కు మంచి లుక్ ఇస్తుంది. దీనిలోని హై-ఎఫిషియెన్సీ హనీకోంబ్ ప్యాడ్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అంతే కాకుండా ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. ఇందులో అమర్చిన క్యాస్టర్ వీల్స్ సహాయంతో.. దీనిని ఇల్లు లేదా ఆఫీసులో ఎక్కడికైనా ఈజీగా మార్చవచ్చు. తక్కువ సౌండ్ తో ప్రశాంతమైన నిద్రను అందించడం దీని క్వాలిటీ. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.8,500 వరకు ఉంటుంది.
ముఖ్య గమనిక:
పైన పేర్కొన్న ధరలు ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, డీలర్ల ఆఫర్ల ఆధారంగా స్వల్పంగా మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు లేటెస్ట్ ఆఫర్లను చెక్ చేసుకోవడం మంచిది.